https://oktelugu.com/

Eluru: అది ఇవ్వలేదని.. తల్లిపై ఫిర్యాదు చేసిన పదేళ్ల కొడుకు

ఏలూరు పట్టణంలోని కొత్తపేటకు చెందిన సాయి దినేష్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. నాలుగో తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 16, 2023 / 10:04 AM IST

    Eluru

    Follow us on

    Eluru: అమ్మను మించి దైవమున్నదా.. ఆత్మను మించి అర్థమున్నదా అన్నారు ఓ సినీకవి. అమ్మలోని కమ్మదనం ఎంతో విలువైనది. మంచి తండ్రి ఉండడు. మంచి అన్న ఉండడు. మంచి మామ ఉండవు. కానీ మంచి అమ్మ మాత్రం ఉంటుంది. అది అమ్మంటే. అమ్మంటే ప్రేమకు రూపం అంటారు. అలాంటి అమ్మ మీదే ఓ కుర్రాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఆలనా పాలనా చూడటం లేదని ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం సంచలనం కలిగించింది. అది కూడా ఓ పదేళ్ల కుర్రాడు కావడం గమనార్హం.

    ఏలూరు పట్టణంలోని కొత్తపేటకు చెందిన సాయి దినేష్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. నాలుగో తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. తన స్నేహితుడి పుట్టిన రోజుకు వెళ్లాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే స్నానం చేశాడు. ఒంటికి టవల్ చుట్టుకున్నాడు. తెల్ల చొక్కా ఇస్తే స్నేహితుడి పుట్టిన రోజు విందుకు వెళ్తానని చెప్పాుడు.

    అమ్మ వద్దని వారించింది. నువ్వు వెళ్లొద్దని తెల్ల చొక్కా ఇవ్వలేదు. దీంతో అతడు టవల్ తోనే పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశాడు. ఏం జరిగింది బాబూ అని వారు వివరాలు ఆరా తీయగా పిల్లవాడు చెప్పింది విని అవాక్కయ్యారు. చొక్కా ఇవ్వలేదని వచ్చావా? అని ఆశ్చర్యపోయారు. దీంతో అతడి తల్లిదండ్రులకు కబురు పంపారు.

    వారు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ముగ్గురిని కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లి మాట వినాలని సూచించారు. బాగా చదువుకోవాలని చెప్పారు. అనంతరం ఇంటికి పంపించారు. ఆ బాలుడు ఇదివరకు కూడా తనను తల్లి చిత్రహింసలకు గురి చేస్తుందని ఫిర్యాదు ఇవ్వడం గమనార్హం. ఇంతకీ ఆమె కన్న తల్లి కాదు. మారుతల్లి అని చెబుతున్నారు. ఇలా బాలుడి కథ సుఖాంతమైంది.