
Teacher Love Student: తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే దక్కుతుంది.. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర: అన్నారు పెద్దలు.. తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని గుర్తు చేసుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ఆయన దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు ఒక రథంలో కూర్చోబెట్టి తాళ్లతో లకెళ్ళారు.. ఒక ఉపాధ్యాయుడికి ఇంతకు మించిన గౌరవం ఏముంటుంది.. అక్కడిదాకా ఎందుకు అబ్దుల్ కలాం కన్నుమూస్తే.. ప్రపంచం మొత్తం కన్నీరు పెట్టింది.. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించగలడు.. వారికి విద్యా బుద్ధులు నేర్పి మేధావులుగా తీర్చిదిద్ద గలడు. కానీ రాను రాను పరిస్థితులు మారిపోతున్నాయి. ఫలితంగా గురువుల పట్ల అభిమానం, ఆప్యాయత, గౌరవం తగ్గిపోతున్నాయి. అలాంటి సంఘటనే హైదరాబాద్లోని చందానగర్ లో జరిగింది.
Also Read: Samantha: సమంత ఇంట్లో ఖాళీగా కూర్చున్నా ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా!
చందానగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 25 సంవత్సరాలు ఉన్న ఉపాధ్యాయిని పనిచేస్తోంది. పాఠాలు బోధించేందుకు బదులుగా అక్కడ పదో తరగతి విద్యార్థితో(15) ప్రేమ వ్యవహారం నడిపింది.. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరిగేవారు. ప్రత్యేక తరగతుల పేరుతో అతడిని ఆమె తన ఇంటికి తీసుకెళ్లలేది. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి పంపించేది.. ఇలా గుట్టుగా సాగిన వారి వ్యవహారం… తర్వాత పెను పరిణామానికి దారి తీసింది. ఉన్నట్టుండి ఆ ఉపాధ్యాయిని ఒకరోజు ఆ విద్యార్థితో పారిపోయింది. ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయుని తాతయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.. రెండు రోజుల తర్వాత తన మనవరాలు ఇంటికి తిరిగి వచ్చేసిందని ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడు.. అదే సమయంలో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచూకీ దొరకడం లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతడు కూడా ఇంటికి తిరిగి రావడంతో ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు కనుగొన్న పోలీసులు.. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరిళ్లకు వారిని పంపారు. తర్వాత సదరు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఆ ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించింది.

ఇక ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.. గతంలోను ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గోరీలపాడు తండా పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు.. తర్వాత గర్భవతిని చేశాడు. అప్పట్లో వ్యవహారం సంచలనం రేకెత్తించింది.. తర్వాత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో.. వారు అతనిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోవాలేగాని ఎన్నో ఘటనలు. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం వల్ల అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు కట్టు తప్పుతున్నారు. తప్పటడుగులు వేస్తూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
Also Read:Ponniyin Selvan: మణిరత్నం అయితే ఏంటట.. తెలుగు వాళ్లకు అందుకే ‘పొన్నియన్’ ఎక్కలేదు..