https://oktelugu.com/

Ramcharan’s wife Upasana : భర్తకు తగ్గ భార్య… వ్యాపార రంగంలో చరణ్ వైఫ్ ఉపాసనకు అరుదైన గౌరవం!

Ramcharan’s wife Upasana : ఒక ప్రక్క రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ప్రపంచ సినిమా వేదికలపై సత్తా చాటుతుంటే, మరో ప్రక్క ఆయన వైఫ్ ఉపాసన కొణిదెల బిజినెస్ లో దూసుకుపోతున్నారు. హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీలో అపార అనుభవం ఉన్న ఉపాసనను మల్టీ నేషనల్ ఫార్మాసిటికల్ కంపెనీ జైడస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు.దీంతో ఉపాసన పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్‌ గా బాధ్యతలు చేపట్టిన యంగ్ ఎంట్రప్రెన్యూర్ గా రికార్డులకు ఎక్కారు.ఉపాసనకు హెచ్‌ఆర్, […]

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2023 / 04:14 PM IST
    Follow us on

    Ramcharan’s wife Upasana : ఒక ప్రక్క రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ప్రపంచ సినిమా వేదికలపై సత్తా చాటుతుంటే, మరో ప్రక్క ఆయన వైఫ్ ఉపాసన కొణిదెల బిజినెస్ లో దూసుకుపోతున్నారు. హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీలో అపార అనుభవం ఉన్న ఉపాసనను మల్టీ నేషనల్ ఫార్మాసిటికల్ కంపెనీ జైడస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు.దీంతో ఉపాసన పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్‌ గా బాధ్యతలు చేపట్టిన యంగ్ ఎంట్రప్రెన్యూర్ గా రికార్డులకు ఎక్కారు.ఉపాసనకు హెచ్‌ఆర్, సిఎస్‌ఆర్, ఐటి రంగాలలో గొప్ప అనుభవం ఉంది. అలాగే బిజినెస్ ఉమన్ గా అరుదైన విజయాలు అందుకున్నారు. ఈ కారణంగా ఉపాసనను ఎంచుకోవడం జరిగింది. ఐదు సంవత్సరాల పాటు జైడస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ సంస్థకు ఇండిపెండెట్ డైరెక్టర్‌గా ఉపాసన సేవలందించనున్నారు.

    ఈ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఉపాసన తన ఆనందం పంచుకున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, వనరులు ఉపయోగించుకొని సమాజహితం, కంపెనీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. తనదైన మార్క్ చూపిస్తూ గొప్ప లక్ష్యాలు చేరుకుంటానని హామీ ఇచ్చారు. ఉపాసన పొందిన ఈ అరుదైన గౌరవం పై భర్త రామ్ చరణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా కంగ్రాట్స్ చెప్పారు.

    బిజినెస్ టైకూన్ ఫ్యామిలీలో పుట్టిన ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా ఉన్నారు. అలాగే ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్.మరోవైపు సామాజిక సేవా కార్యకర్తగా ఉన్నారు. వ్యాపార, సేవా రంగాల్లో అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ఉపాసన ఇంకా అనేక రంగాల్లో రాణిస్తున్నారు.

    2012లో రామ్ చరణ్ ని వివాహం చేసుకొని ఆమె మెగా కోడలు అయ్యారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమన్ గా అవతరించారు. గత ఏడాది ఉపాసన గర్భం దాల్చారు. పదేళ్ల తర్వాత సాకారమైన కల కావడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఉపాసన త్వరలో మెగా వారసుడికి జన్మనివ్వనున్నారు. తన డెలివరీ ఇండియాలో అపోలో హాస్పిటల్స్ లో జరుగుతుందని ఉపాసన తెలియజేశారు.