Hyderabad: నడి రోడ్డుపై మహిళను వివస్త్రను చేసిన దుర్మార్గుడు

హైదరాబాద్ బాలానగర్ ప్రాంతం అది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఓ మహిళ షాపింగ్ నిమిత్తం రోడ్డుపై నడిచి వెళుతోంది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు వెంబడించాడు.

Written By: Dharma, Updated On : August 7, 2023 2:40 pm

Hyderabad

Follow us on

Hyderabad: సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది . నడిరోడ్డు పై నడిచి వెళుతున్న మహిళపై ఆకతాయి దాడి చేశాడు. వివస్త్రను చేసి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఇదంతా అతని తల్లి సమక్షంలో జరగడం జుగుప్సాకరంగా ఉంది.

హైదరాబాద్ బాలానగర్ ప్రాంతం అది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఓ మహిళ షాపింగ్ నిమిత్తం రోడ్డుపై నడిచి వెళుతోంది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు వెంబడించాడు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు వద్దని వారించినా వినలేదు. ఆమె ఒంటిపై ఉన్న బట్టలను తొలగించాడు. లైంగిక దాడి చేసే సమయంలో స్థానికులు అడ్డుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులుకు అప్పగించారు. బాధిత మహిళకు అక్కడే ఉన్న ఓ ప్లాస్టిక్ బ్యానర్ను అందించడంతో.. చుట్టుకుని అక్కడినుంచి వెళ్ళిపోయింది.

మహానగరంలో రోడ్డుపై వెళ్తున్న మహిళలకి రక్షణ లేకపోతే.. మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఈ ఆకతాయి తల్లి సమక్షంలోనే ఈ ఘటనకు పాల్పడడం విశేషం. కొడుకు చేసిన అఘాయిత్యాన్ని తల్లి వెనుకేసుకు రావడంవిస్తు గొలుపుతోంది. ఆకతాయి యువకుడు కానిస్టేబుల్ అని ప్రచారం జరిగింది. కానీ అందులో వాస్తవం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నిందితుడు పేరు పెద్ద మారయ్య అని.. జులాయిగా తిరుగుతుంటాడని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన చేయడానికి పోలీస్ శాఖ సిద్ధమవుతోంది.