London Beggar: బిక్షాధికారే లక్షాధికారి అంటారు. బిచ్చమెత్తుకునే వాడైనా కోటీశ్వరుడే. బిచ్చగాడు సినిమాలో హీరో కూడా కోటీశ్వరుడైనా తన తల్లి ఆరోగ్యం కోసం బిచ్చమెత్తుకుంటాడు. కోటీశ్వరుడైనా బిచ్చమెత్తుకునే వారు చాలా మంది ఉన్నారు. గతంలో ముంబైలో ఓ బిచ్చగాడు చనిపోతే అతడి ఆస్తి చూస్తే అందరు అవాక్కయ్యారు. అతడి ఇంట్లో డబ్బుల కట్టలు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. రోడ్ల మీద బిచ్చమెత్తుకునే వాడైనా లక్షాధికారులే ఉంటున్నారు. వారి ఆస్తులు తెలిస్తే షాకే. ఇక్కడో బిచ్చగాడికి నెలకు ఇంటి కిరాయిలే రూ. 1.27 లక్షలు వస్తున్నా అతడు మాత్రం బిచ్చమెత్తుకోవడం సంచలనం కలిగిస్తోంది.

లండన్ లోని డోమ్ అనే వ్యక్తి మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడు అథ్లెటిక్స్ లో చురుగ్గా ఉండటంతో అతడికి చదువు అబ్బలేదు. అథ్లెటిక్స్ లో వచ్చే ఉపకార వేతనంతో జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో డ్రగ్స్ కు అలవాటయ్యాడు. పదమూడేళ్లకే మద్యపానం, డ్రగ్స్, అల్కహాల్ లకు బానిసయ్యాడు. హెరాయిన్ కు దగ్గరయ్యాడు. మరో మూడేళ్లలో అతడికి అన్ని అలవాట్లు వచ్చాయి. డోమ్ ను ఎలా దారికి తీసుకురావాలో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. డోమ్ ను ఎలా మార్చాలనే కోణంలో ఆలోచించారు. అతడికి పెళ్లి చేయాలని భావించి వివాహం జరిపించారు. కానీ డోమ్ మాత్రం మారలేదు. అతడి నిజస్వరూపం తెలియడంతో భార్య వదిలిపెట్టింది.
ఇక మారడని అనుకుని అతడికి ఓ ఇల్లు కొనుగోలు చేసి ఇచ్చారు. ఆస్తులు పోయినా ఇల్లు మిగులుతుందని అనుకుని గృహం కొనిచ్చారు. ఆ ఇంటికి వస్తున్న కిరాయితో డ్రగ్స్ కొనుగోలు చేసుకుని వాటిని తీసుకుంటూ మత్తులో జోగుతున్నాడు. రోడ్ల మీద బిచ్చమెత్తుకుని తిరుగుతున్నాడు. భిక్షాటన ద్వారా రోజుకు 200 నుంచి 300 వరకు సంపాదిస్తున్నాడు. రోజంతా డ్రగ్స్ కొనుగోలు చేసుకుని మత్తులోనే తూగుతున్నాడు. డ్రగ్స్ మత్తులో రోడ్ల పక్కన పడుకుంటున్నాడు.

డోమ్ కు రూ. 5 కోట్ల విలువైన ఇల్లు ఉన్నా అతడు మాత్రం తన భిక్షాటన మానడం లేదు. రోడ్డు మీద బిచ్చమెత్తుకుంటూ తిరగడం అతడికి అలవాటుగా మారింది. డ్రగ్స్ కు దూరంగా ఉందామని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. సాధారణ జీవితం గడపాలని అనుకున్నా సాధ్యం కావడం లేదు. జీవితాన్ని వ్యసనాలకు బానిసైన డోమ్ కు మంచి ఇల్లు ఉన్నా అతడు మాత్రం రోడ్డు మీదే పడుకోవడం గమనార్హం. చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నట్లు సొంత ఇల్లు ఉన్నా బిచ్చగాడి అవతారంతోనే అతడు కాలం వెళ్లదీస్తుండటం ఆందోళనకు తావిస్తోంది.