https://oktelugu.com/

Actro Ravi Kishan : ఆమె నన్ను రాత్రికి రమ్మంది… క్యాస్టింగ్ కౌచ్ నాకు కూడా తప్పలేదు, బన్నీ విలన్ షాకింగ్ కామెంట్స్

Actro Ravi Kishan : సాధారణంగా క్యాస్టింగ్ కౌచ్ అమ్మాయిలకే అనుకుంటాం. కానీ అందమైన అబ్బాయిలకు కూడా తప్పదట. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది. అలాంటి అనుభవాలు నాకు కూడా ఎదురయ్యాయని ప్రముఖ నటుడు రవికిషన్ వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… క్యాస్టింగ్ కౌచ్ నేను కూడా ఎదుర్కొన్నాను. ఓ మహిళ నన్ను కాఫీ తాగుదాం రాత్రికి రమ్మంది. సాధారణంగా కాపీ ఉదయమో, సాయంత్రం వేళో తాగుతారు. రాత్రికి రమ్మన్న ఆమె ఆలోచన నాకు అర్థమైంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 28, 2023 / 08:20 AM IST
    Follow us on

    Actro Ravi Kishan : సాధారణంగా క్యాస్టింగ్ కౌచ్ అమ్మాయిలకే అనుకుంటాం. కానీ అందమైన అబ్బాయిలకు కూడా తప్పదట. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది. అలాంటి అనుభవాలు నాకు కూడా ఎదురయ్యాయని ప్రముఖ నటుడు రవికిషన్ వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… క్యాస్టింగ్ కౌచ్ నేను కూడా ఎదుర్కొన్నాను. ఓ మహిళ నన్ను కాఫీ తాగుదాం రాత్రికి రమ్మంది. సాధారణంగా కాపీ ఉదయమో, సాయంత్రం వేళో తాగుతారు. రాత్రికి రమ్మన్న ఆమె ఆలోచన నాకు అర్థమైంది. దాంతో నేను రానని చెప్పేశాను. ఆమె పేరు చెప్పలేను. ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఆమె ఉన్నారంటూ, చెప్పుకొచ్చారు.

    నాకు టాలెంట్ ఉందని నేను నమ్ముతాను. అందుకే షార్ట్ కట్స్ వెతుక్కోలేదు. కష్టపడి పైకి వచ్చానని అన్నారు. చిన్నప్పటి నుండి నటన మీద మక్కువతో రవికిషన్ ఆ దిశగా ప్రయత్నాలు చేసేవాడట. తండ్రికి మాత్రం ఇష్టం ఉడేది కాదట. ఒక రోజు ఆయన తల్లి రూ. 500 ఇచ్చి ముంబైకి వెళ్లి ప్రయత్నాలు చేయమన్నారట. 1992లో విడుదలైన పీతాంబర్ మూవీతో రవికిషన్ వెండితెరకు పరిచయమయ్యారు.

    తెలుగులో ఆయన మొదటి చిత్రం రేసు గుర్రం. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పొలిటీషియన్ మద్దాలి శివారెడ్డి పాత్రలో రవికిషన్ అలరించారు. విలన్ గా ఆయన విలక్షణత చూపించారు. రేసు గుర్రం అనంతరం తెలుగులో ఆయనకు చాలా అవకాశాలు వచ్చాయి. సుప్రీమ్, లై, సైరా నరసింహారెడ్డి, 90 ఎం ఎల్, సాక్ష్యం, ఎం ఎల్ ఏ, ఎన్టీఆర్ కథానాయకుడు.. ఇలా పలు చిత్రాల్లో నటించారు.

    రవి కిషన్ అధికంగా హిందీ, భోజ్ పురి చిత్రాలు చేశారు. కాగా ఆయన రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. మొదట కాంగ్రెస్ లో చేరిన రవికిషన్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో గోరఖ్ పూర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా పార్లమెంట్ కి వెళ్లారు.