Tamil Nadu: కూలీ కూతురు.. ప్రభుత్వ పాఠశాలలో చదివి 600కు 600 మార్కులు.. ఓ రికార్డ్

తల్లిదండ్రులు కూలీలు.. రోజూ వారు పనిచేస్తే గానీ అన్నం దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడానికి ఇష్టపడరు.

Written By: Chai Muchhata, Updated On : May 9, 2023 1:26 pm

Tamil Nadu

Follow us on

Tamil Nadu: ‘కృషి, పట్టుదల ఉంటే విజయం మీవెంటే’.. ఇలాంటి డైలాగ్స్ సినిమాల్లో.. ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది.. జీవితంలో అది సాధ్యం కాదు అని చాలా మంది అభిప్రాయం. అయితే కొందరు వీటిని సాధ్యం చేస్తున్నారు. భవిష్యత్ ను బంగారు లోకంగా తీర్చిదిద్దేందుకు కొందరు విద్యార్థులు చిన్న వయసులోనే పెద్ద కష్టం పడుతున్నారు. ఫలితంగా తల్లిదండ్రులకు గుర్తింపునిస్తున్నారు. ఇటీవల విడుదలయిన ఇంటర్ ఫలితాల్లో ఓ అమ్మాయి 600 కు 600మార్కులు తెచ్చుకుంది. ఇలాంటి మార్కులు ఇప్పటికీ చాలా మందికి వచ్చాయి. కానీ ఆ అమ్మాయి ఈ మార్కులు తెచ్చుకోవడానికి ఎలాంటి కష్టాలు పడిందో తెలిస్తే కన్నీళ్లు రాకుండా ఉండవు.

తల్లిదండ్రులు కూలీలు.. రోజూ వారు పనిచేస్తే గానీ అన్నం దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడానికి ఇష్టపడరు. తమకు చేదోడువాదోడుగా ఉంటారని ఏదో పనిలో పెడుతారు. కానీ ఈ విద్యార్థిని తల్లిదండ్రులు అలా ఆలోచించలేదు. వారు చేసేది కూలీ పని అయినా ఉన్నతంగా ఆలోచించారు. చదువుకుంటేనే గొప్ప జీవితం ఉంటుందని, ఆ జీవితం తమ కూతురుకు ఉండాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఎంత కష్టమైనా పర్వాలేదని ఆలోచించి తమ కూతురును చదువుకునేందుకు పంపారు.

తమిళనాడు జిల్లాలోని దిండిగల్ కు చెందిన నందిని చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది. ఒక పూట తిండి.. మరో పూట కడుపు మార్చుకొని పుస్తకాలు చేతబట్టింది. ఇలా అతి కష్టం మీద ఆమె అన్నామలైయర్ మిల్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ ప్రభుత్వ పాఠశాలలో చదువును పూర్తి చేసింది. అయితే తమిళనాడు పాఠశాలల్లోనే 12వ తరగతి వరకు ఉంటుంది. తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రకారం ఈసారి 8 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీటి ఫలితానలు మే 8న విడుదల చేయగా.. అందులో 7,55,451 మంది పాసయ్యారు.

ఇందులో నందిని ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్స్.. ఇలా అన్ని సబ్జెక్లుల్లో 100కు 100 మార్కుులు తెచ్చుకుంది. ప్రతీ సబ్జెక్టులో 100 మార్కులు వస్తాయని తాను కూడా ఊహించలేదని నందిని తెలుపుతోంది. ఈ సందర్భంగా ఆమెను పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ప్రముఖులు అభినందిస్తున్నారు. తండ్రి పడే కష్టాన్ని చూసి తాను కూడా ఎంతో కష్టపడి ఉన్నత స్థితికి రావాలని కోరుకున్నానని, ఆ పట్టుదలే నన్నీ స్థితికి తీసుకొచ్చిందిన ఈ సందర్భంగా నందిని పేర్కొంటున్నారు.