Car Stunts: కార్లు.. వ్యక్తి ఉన్నత స్థితిని తెలియజేస్తాయి. రేంజ్ ఆధారంగా వ్యక్తి ఆర్థిక స్థితిని అంచనా వేయొచ్చు. అయితే కొంతమంది ట్యాక్సీ కోసం కూడా కార్లు కొనుగోలు చేస్తారు. వివిధ కంపెనీల్లో క్యాబ్ కోసం కూడా కార్లు పెడతారు. ఇక రేస్ కార్ల గురించి చెప్పనక్కరలేదు.. ఇటీవల వీటి కొనుగోళ్లు పెరిగాయి. రేస్‌లు కూడా పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఓ ఇద్దరు వ్యక్తులు చిన్న కార్లతో చిత్రమైన ఫీట్లు చేసి ఔరా అనిపించారు.
ఒకరు స్ట్రెయిట్‌గా.. ఇంకొకరు రివర్స్‌గా..
చిన్న కార్లతో ఇద్దరు వ్యక్తులు చేసిన ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇందులో ఒకరు బ్లాక్, మరొకరు వైట్ కలర్ బుల్లి కార్లతో సర్కస్ ఫీట్లు చేశారు. మొదట బ్లాక్ కలర్ కారు.. రివర్స్‌లో ఇనుప రేకుపైకి ఎక్కించారు. తర్వాత.. వైట్‌కార్ స్ట్రెయిట్‌గా దానిపైకి ఎక్కింది. చిన్నపాటి రేకుపై రెండుకార్లు ఎక్కగానే… ఆ రేకు నెమ్మదిగా పైకి లేవడం ప్రారంభించింది.
బ్యాలెన్స్‌తో అద్భుతం..
ఇనుప రేకుపై ఇద్దరు డ్రైవర్లు రెండు కార్లను బ్యాలెన్స్ చేయడం ఇప్పుడు అబ్బుర పరుస్తోంది. బ్లాక్ కార్ డ్రైవర్ ఒక కొన చివరన స్థిరంగా ఉండగా, వైట్ కార్ డ్రైవర్ మాత్రం ముందుకు వెనకకు కదులుతూ పట్టీపై ఉన్న రేకుపై సర్కస్‌లాంటి ఫీట్లు చేశాడు. దీంతో ఆ రేకు బ్యాలెన్స్ ఒకవైపు రాగానే ముందుకు.. అటువైపు వెళ్లగానే వెనుకకు డ్రైవ్ చేయడం చూపరులను ఆకట్టుకుంటోంది. ఎంతో ప్రాక్టిస్, డ్రైవింగ్ అనుభవం ఉంటేకాని ఇలాంటి ఫీట్ చేయలేరని నెటిజన్లు అంటున్నారు.
సోషల్ మీడియలో చెక్కర్లు..
రెండు బుల్లి కార్ల సర్కస్ ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇద్దరు డ్రైవర్ల డ్రైవింగ్ నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్ అని చాలా మంది కామెంట్ పెడుతున్నారు. కొంతమంది ఎక్కడి నుంచి వచ్చార్రా మీరు అని.. మిస్ అయితే పరలోకానికే అని.. కార్లతో సర్కస్ ఏంట్రా అని కామెంట్ చేస్తున్నారు.
Master Drivers pic.twitter.com/xAqI2Vdzxd
— The Best (@ThebestFigen) July 23, 2023