https://oktelugu.com/

Producer : బియ్యం కూడా కొనుక్కోలేని దీనమైన స్థితి లో ప్రముఖ నిర్మాత.. ఆర్ధిక సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్న హీరో సూర్య

Producer : సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం..ఒక్కసారిగా రాత్రికి రాత్రి గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టి కోట్ల రూపాయిల సంపాదన ఇస్తుంది, అదే సమయం లో కోటీశ్వరుడుని పాతాళలోకం లోకి నెట్టేసి కష్టాలపాలు చేస్తుంది.ఇప్పుడు ఒక ప్రముఖ తమిళ నిర్మాత పరిస్థితి కూడా అలాగే అయ్యింది.ఒకప్పుడు సూర్య , విక్రమ్ , సూపర్ స్టార్ రజినీకాంత్ , కమల్ హాసన్ ఇలా తమిళ స్టార్ హీరోలందరితో పని చేసిన ఆ నిర్మాత పరిస్థితి ప్రస్తుతం ఆర్ధిక […]

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2023 / 07:48 PM IST
    Follow us on

    Producer : సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం..ఒక్కసారిగా రాత్రికి రాత్రి గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టి కోట్ల రూపాయిల సంపాదన ఇస్తుంది, అదే సమయం లో కోటీశ్వరుడుని పాతాళలోకం లోకి నెట్టేసి కష్టాలపాలు చేస్తుంది.ఇప్పుడు ఒక ప్రముఖ తమిళ నిర్మాత పరిస్థితి కూడా అలాగే అయ్యింది.ఒకప్పుడు సూర్య , విక్రమ్ , సూపర్ స్టార్ రజినీకాంత్ , కమల్ హాసన్ ఇలా తమిళ స్టార్ హీరోలందరితో పని చేసిన ఆ నిర్మాత పరిస్థితి ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభం లో మునిగిపోయి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చేసింది.

    బియ్యం కొనుక్కవాలన్న ఒకరి దగ్గర అప్పు చెయ్యాల్సిందే, అలాంటి దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది.ఆయన పేరే దురై.ఇతనికి పెద్ద హీరోలు డేట్స్ అయితే బాగానే ఇచ్చారు కానీ , కెరీర్ లో ఒక్క హిట్ తప్ప మరొకటి లేదు.ఆ ఒక్క హిట్ కూడా సూర్య – విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన శివపుత్రుడు అనే చిత్రం.

    ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, దీనితో తీవ్రమైన అప్పులపాలై, ఆరోగ్యం చెడగొట్టుకొని ప్రస్తుతం అత్యంత దీనమైన పరిస్థితి లో ఉన్నాడు.ఈ విష్యం తన సన్నిహితుల ద్వారా తెలుసుకున్న హీరో సూర్య వెంటనే స్పందించి దురై గారికి రెండు లక్షల రూపాయిల ఆర్ధిక సహాయం అందించాడు.అంతే కాదు ఆయన ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని మాటిచ్చాడట.సూర్య చూపించిన ఉదారత్వం కి సోషల్ మీడియా అంతటా ప్రశంసల వర్షం కురుస్తుంది.

    ప్రస్తుతం సూర్య ప్రముఖ తమిళ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఒక మాస్ మసాలా మూవీ లో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.ఈ చిత్రం తో పాటుగా ఆయన నిర్మాతగా మారి హిందీ లో అక్షయ్ కుమార్ ని హీరో గా పెట్టి ‘ఆకాశమే నీ హద్దురా’ రీమేక్ చేస్తున్నాడు.ఈ చిత్రం సూర్య కి నేషనల్ అవార్డు ని కూడా తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.