Unique And Weird Ways Of Burial: ఒక మనిషి చనిపోతే పూడ్చిపెడతారు..లేదా కట్టెలను పేర్చి కాలుస్తారు. కానీ అక్కడ మాత్రం చనిపోయిన మృతదేహాన్ని రాబందులకు విసిరేస్తారు.. కొన్ని చోట్ల ఒకరి కోసం మరొకరిని హత్య చేస్తారు. ఈ భూమ్మీద ఎన్నో వింతలు, విశేషాలున్నాయి. కానీ మరణం విషయంలో అందరి భావన ఒక్కటే. చనిపోయిన వ్యక్తి ఆత్మ చేకూరాలి. వారి ఆత్మ శాంతి కోసంమ ఎన్నో పద్దతులు పాటిస్తారు. కానీ కొందరు మాత్రం వింత ఆచారాలు పాటిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. వీరు ఇలా చేయడం బయటి ప్రపంచానికి నచ్చకపోయినా తరతరాల నుంచి వారు ఇదే సంస్కృతిని పాటిస్తున్నారు. మరి అలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు ఎక్కడున్నాయో తెలుసా..?
ప్రపంచంలో మనిషి పుట్టుక ఒకే రకంగా ఉన్నా ఆయా ప్రాంతాల్లో జీవన విధానం విభిన్నంగా ఉంటుంది. వివిధ మతాలకు చెందిన తమ ఆచార, సాంప్రదాయాల ప్రకారంగా నడుచుకుంటారు. అయితే ఒకరు పాటించే సంస్కృతి మరొకరికి నచ్చకపోవచ్చు. కానీ కొందరు వింత ఆచారాలను పురాణాల కాలం నుంచి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మరణం విషయంలో విభిన్న పద్ధతులు పాటిస్తూ తమ బంధువుల ఆత్మకు శాంతి చేకూరాలని చూస్తారు. భారతదేశంలో అయితే మరణించిన ప్రతీ వ్యక్తిని కాల్చడం లేదా ఖననం చేస్తారు. కానీ కొన్ని ప్రదేశాల్లో ఈ రెండు పద్దతుల్లో కాకుండా ఆశ్చర్యకర రీతిలో సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు.
Also Read: Nagababu Emotional Post: నాన్న.. అప్పుడు నాకు జ్ఞానం లేదు, ఇప్పుడు మీరు లేరు – నాగబాబు
పూడ్చిన మృతదేహాన్ని బయటకి తీసి..
ఒకసారి మృతదేహాన్ని పూడ్చిన తరువాత ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప మళ్లీ దాని జోలికి వెళ్లరు. మడగాస్కర్లోని ప్రజలు ఇందుకు విభిన్నం. చనిపోయిన వ్యక్తిని ఇక్కడ పూడ్చి పెడుతారు. అయితే కొన్ని రోజుల తరువాత మళ్లీ ఆ మృతదేహాన్ని బయటకు తీసి స్నానం చేయిస్తారు. శుభ్రమైన దుస్తులు వేస్తారు. ఆ తరువాత కుటుంబ సభ్యులంతా ఆ మృతదేహం చుట్టూ చేసి నృత్యాలు చేస్తారు. ఈ కార్యక్రమాలు పూర్తయిన తరువాత తిరిగి శవాన్ని పూడ్చిపెడుతారు.
ఒకరి కోసం మరొకరి హత్య..
మనకు తెలిసిన వారు ఎవరైనా చనిపోతే ఎంతో బాధపడుతాం. కానీ కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లో ఓ వ్యక్తి చనిపోతే తనకు ఇష్టమైన వారిని చంపేస్తారు. ఏ వ్యక్తి ప్రపంచాన్ని విడిచి ఒంటరిగా ఉండకూదనేది వీరి అభిప్రాయం. అందుకే వారికి తోడుగా మరొకరిని హత్య చేస్తారు.
మృతదేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికి
టిబెట్, మంగోలియా ప్రాంతాల్లో మృతదేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికేస్తారు. లేదంటే చెట్టుపై వేలాడదీస్తారు. ఇలా చేరయడం వల్ల వారి ఆత్మ త్వరగా స్వర్గ ద్వారాలకు చేరుతుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
శవపేటికను పర్వత శిఖరాలపై..
చైనాలోని కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన వ్యక్తి శవపేటికలో పెడుతారు. ఆ తరువాత దీనిని పర్వత శిఖరాలపై ఉంచుతారు. ఇలా ఎత్తైన కొండలపై ఉంచడం వల్ల ఆ వ్యక్తి ఆకాశానికి దగ్గరగా ఉండి సులభంగా స్వర్గానికి చేరుతారని వీరి నమ్మకం..
శవాన్ని రాబందులకు ఆహారంగా..
పార్సీ సమాజంలో నేటికీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే వారి మృతదేహానకి స్నానం చేయించి తమ ప్రార్థనా స్థలం వద్ద ఉంచుతారు. ఆ తరువాత రాబందులు అక్కడికి వచ్చి శవాన్ని పీక్కు తింటాయి. ఒక వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలంటే రాబందులు తినాలని వీరు నమ్ముతారు. అలా రాబందులు స్వర్గానికి వెళ్లేందుకు సాయం చేస్తాయట.
Also Read:Auction Amravati Lands: అమ్మకానికి అమరావతి భూములు.. చంద్రబాబు కు జగన్ కు ఇదే తేడా