https://oktelugu.com/

Star Heros Income : స్టార్ హీరోలకు కొత్త చిక్కు.. కోట్ల రూపాయల ఆదాయానికి గండి!

Star Heros Income : స్టార్ హీరోలతో పాటు స్పోర్ట్స్ స్టార్స్, ఇతర రంగాల ప్రముఖులకు కొత్త చిక్కు వచ్చి పడింది. వారి కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సెలెబ్రిటీలు తాము ప్రచారం చేసే ఉత్పత్తులను ముందుగా తాము వాడి తర్వాత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. వ్యాపార ప్రకటన స్పష్టమైన భాషల్లో సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఉండాలని సూచించారు. ప్రకటనలో యాడ్, స్పాన్సర్డ్, […]

Written By:
  • NARESH
  • , Updated On : March 7, 2023 / 08:36 PM IST
    Follow us on

    Star Heros Income : స్టార్ హీరోలతో పాటు స్పోర్ట్స్ స్టార్స్, ఇతర రంగాల ప్రముఖులకు కొత్త చిక్కు వచ్చి పడింది. వారి కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సెలెబ్రిటీలు తాము ప్రచారం చేసే ఉత్పత్తులను ముందుగా తాము వాడి తర్వాత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. వ్యాపార ప్రకటన స్పష్టమైన భాషల్లో సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఉండాలని సూచించారు. ప్రకటనలో యాడ్, స్పాన్సర్డ్, పార్ట్నర్షిప్ అనే పదాలలో ఏదో ఒకటి పొందుపరచాలని నిబంధనలు జారీ చేశారు. ఇది సెలెబ్రెటీలను ఇరుకున పెట్టే విషయమే.

    సినిమాలకు మించి స్టార్ హీరోలు వ్యాపార ప్రకటనల ద్వారా సంపాదిస్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా ఉంటున్నారు. మహేష్, అల్లు అర్జున్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి స్టార్స్ పదుల సంఖ్యలో బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నారు. వారి స్టార్డం, బ్రాండ్ వాల్యూ కారణంగా సంస్థలు వారిని బ్రాండ్ అంబాసిడర్స్ గా నియమించుకుంటున్నాయి. కొత్తగా వచ్చిన నిబంధల ప్రకారం సదరు ఉత్పత్తులను వారు స్వయంగా ఉపయోగించి ఫలితం తెలిశాక… వాడాలంటే అది జరిగే పని కాదు.

    అసలు వ్యాపార ప్రకటన అంటే జనాలను మోసం చేసే పెద్ద టెక్నిక్. ప్రయోజం, ఫలితంతో సంబంధం లేకుండా ఒక పెద్ద స్టార్ ప్రమోట్ చేస్తే అందులో నిజం ఉంటుందని కస్టమర్స్ నమ్ముతారు. ఎంత మంచి ప్రొడక్ట్ అయినప్పటికీ బ్రాండ్ వాల్యూ లేకపోతే మనం ఉపయోగించడం. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్ జనాల్లోకి త్వరగా వెళ్లాలంటే బ్రాండ్ అంబాసిడర్ అవసరం. అలాగే పేరున్న ప్రొడక్ట్ సేల్స్ పెరగాలన్నా ప్రచారం ఏకైక మార్గం. అందుకే కోట్లు కుమ్మరించి సెలెబ్రిటీలను తమ ఉత్పత్తుల ప్రచారకర్తలుగా నియమించుకుంటారు.

    అలా జనాలు గుడ్డిగా నమ్మి వస్తువులు కొంటారు. ఫెయిర్ అండ్ లవ్లీ వాడినంత మాత్రానా తెల్లగా అవరు. పెర్ఫ్యూమ్ కొట్టుకున్నంత మాత్రాన అమ్మాయిలు పడరు. కానీ యాడ్స్ లో చూపించేది ఇదే. ప్రొడక్ట్ ప్రయోజనంతో సంబంధం లేకుండా మనిషి ఎమోషన్ తో బిజినెస్ చేస్తారు. మన దేశంలో ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులను ప్రచారం చేయకూడదు. అయితే వ్యాపార సంస్థలు లూప్ హోల్స్ వాడుకుని ఆల్కహాల్, గుట్కా వంటి ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తుంటాయి. క్లబ్ షోడా పేరున కింగ్ ఫిషర్ బీర్ ప్రమోట్ చేస్తారు. కింగ్ ఫిషర్ అంటే ఆల్కహాల్ అనే అందరికీ తెలుసు, షోడా అని కాదు. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి నిబంధనలు ఎన్ని పెట్టినా సంస్థలు లూప్స్ వెతుకుతూనే ఉంటాయి.