Homeట్రెండింగ్ న్యూస్Uttar Pradesh: పెళ్లై నెల కూడా కాలేదు.. 4వ నెల కడుపు.. ట్విస్ట్ ఇదీ

Uttar Pradesh: పెళ్లై నెల కూడా కాలేదు.. 4వ నెల కడుపు.. ట్విస్ట్ ఇదీ

Uttar Pradesh
Uttar Pradesh

Uttar Pradesh: కొత్తగా పెళ్లి చేసుకున్న జంట మూడు నెలల తరువాత ఎలాంటి తీపి కబురు చెబుతుందోనని కటుుంబ సభ్యులు ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటారు. తమ ఇంట్లోకి ఓ కొత్త మనిషి వస్తే బాగుంటుందన్న ఆశతో ఉంటారు. ఇలాంటి ఆశలు పెట్టుకున్న ఓ కుటుంబ సభ్యులకు కొత్త కోడలు షాక్ ఇచ్చింది. పెళ్లయిన మూడు నెలల వరకు ఆగకుండా నెలరోజులకే తీపి కబురు చెప్పింది. తనకు నాలుగవ నెల అన్న విషయం వైద్యులు పరీక్షించి తెలపడంతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా తనను మోసం చేశావని పేర్కొంటూ భార్యపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా బయటకొచ్చినా.. సంచలనం రేపుతోంది.

పెళ్లంటే నూరెళ్ల పంట. ఈటేడు తరాలు.. అటేడు తరాలు చూసి పెళ్లి చేయాలని గతంలో పెద్దలు చెప్పే వారు. కానీ కాలం మారుతున్న కొద్దీ పెళ్లి చేసుకోబోయే వారి ఇష్టఇష్టాలను తెలుసుకుంటున్నారు. అయితే కొందరు దీనిని అవకాశాన్ని తీసుకొని పెళ్లికి ముందే ఇతరులను లవ్ చేస్తున్నారు. కానీ వారి ప్రేమను పేరేంట్స్ యాక్సెప్ట్ చేయకపోవడంతో ఆ తరువాత ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. మరికొందరు ఒకరినొకరు విడిచి ఉండలేని ఒక్కటవుతున్నారు. ఈ క్రమంలో ఇతరులను పెళ్లి చేసుకున్న తరువాత దాచినా దాగని విషయాలు కొన్ని బయటపడుతూ ఉంటాయి. అందుకు ఉదాహరణే ఈ సంఘటన.

ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ ప్రాంతంలోని ఓ జంటకు నెల రోజుల కిందట వివాహమైంది. పెద్దల సమక్షంలో కుదిరిన వీరి పెళ్లి సందడిగా జరిగింది. ఆ తరువాత వీరిద్దరు అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. అయితే పెళ్లయి నెలరోజులు గడిచిన తరువాత కొత్త కోడలుకు కడుపు నొప్పి అని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నవ వధువును పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చారు. తాను 4నెలల కడుపుతో ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.

Uttar Pradesh
Uttar Pradesh

తన కడుపులోని బిడ్డ ఎవరిదంటూ ఆమె భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లయిన నెలలోనే నాలుగు నెలల కడుపు ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె నాలుగు నెలల కడుపునకు కారణం ఎవరన్నది మాత్రం ఆమె తెలపడం లేదు. దీంతో పెళ్లింట ఇలాంటి షాకింగ్ విషయం తెలిసినందుకు భర్త కుటుంబ సభ్యులు ఆవేదన వక్తం చేస్తున్నారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular