Delhi Metro: సిటీ ప్రయాణికులను ఫాస్ట్ గా గమ్యానికి తీసుకెళ్లేందుకు మెట్రో రైళ్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు సాధారణ రైలులో ప్రయాణికుల ఇబ్బందులను చూసి రైల్వే వ్యవస్థ మెట్రో ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని సక్రమంగా వినియోగించుకోవాల్సి ఉండగా కొందరు తాము చేసే బూతు పనులకు వాడుకుంటున్నారు. దేశంలోని ఏ మెట్రోలో చూసినా ఇటువంటి సంఘటనలే జరుగుతుండడంతో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ జంట చేసిన పనికి దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకు ఆ జంట ఏం చేసిందంటే.
ఓ అమ్మాయి సీటుపై కూర్చొని ఉంది. తనతో ఉన్న అబ్బాయి ఎదురుగా మోకాళ్లపై కూర్చొని ఉన్నాడు. తన వెంట తెచ్చుకున్న కూల్ డ్రింక్ ను అమ్మాయి నోట్లో పోశాడు. దీంతో తనపై ఎంతో ప్రేమ ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి వెంటనే తన నోట్లో ఉన్న కూల్ డ్రింక్ ను ఆ అబ్బాయి నోట్లో ఉమ్మేసింది. ఈ వీడియోను కొందరు తీస్తున్నా.. ఆ జంట ఏమాత్రం భయపడకుండా తమ పనిని కానిచ్చేస్తున్నారు. చీదరించుకునే ఈ పనిని చేస్తున్న వీరిని చాలా మంది అసహించుకుంటున్నారు.
ఈ వీడియో ట్విట్టర్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొన్ని మెట్రో రైళ్లు బూతు పనులకు అడ్డాగా మారుతున్నాయని, ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఘోరాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి వారి చేష్టలతో సాధారణ ప్రజలు మెట్రోలో ప్రయాణించాలంటే భయపడుతున్నారు.
Why should I suffer alone!!!#Delhi #Metro pic.twitter.com/LaQnvjhPD3
— X (@MonkwhoguidedSe) October 11, 2023