Cochin University Professor: పుష్ప-2 చిత్రం విడుదల సందర్భంగా ముందస్తుగా ఏర్పాటు చేసిన షో లో తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసింది. ఈ ఘటనలో హైదరాబాదు నగరానికి చెందిన రేవతి అనే మహిళ కన్ను మూసింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం కాస్త వివాదానికి దారి తీసింది. రేవతి మృతి నేపథ్యంలో అల్లు అర్జున్ పై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నోటీసులు అందించిన అనంతరం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. అయితే ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపడంతో మరోసారి అల్లు అర్జున్ ను పోలీసులు విచారణ నిమిత్తం చిక్కడపల్లికి రావాలని కోరడంతో.. ఆయన అక్కడికి వెళ్లారు. మంగళవారం దీనికి సంబంధించి విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది..
ప్రొఫెసర్ స్టెప్పులు
సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన రాజకీయంగా దుమారం రేపుతుండగా.. కేరళలోని ఓ ప్రొఫెసర్ మాత్రం పుష్ప సినిమాలోని పీలింగ్స్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన విద్యార్థులతో కలిసి ఆ పాటకు లయబద్ధంగా భంగిమలను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ వేడుకలో ఆ మహిళా ప్రొఫెసర్ విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేశారు. పీలింగ్స్ పాటలో రష్మిక, అల్లు అర్జున్ ఎలాగైతే స్టెప్పులు వేశారో.. సేమ్ అచ్చుగుద్దినట్టు దింపేశారు. మహిళా ప్రొఫెసర్ డ్యాన్స్ వేస్తుండడం.. పక్కనే ఉన్న విద్యార్థులకు కూడా తెగ నచ్చింది. దీంతో వారు ఆమెను విపరీతంగా ఎంకరేజ్ చేశారు. విద్యార్థులు ఈలలు వేస్తూ గోల చేయడంతో ఆ ప్రొఫెసర్ మరింత ఉత్సాహంతో డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో దర్శనమిస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాకుండా అల్లు అర్జున్ కు కేరళ రాష్ట్రంలోనూ విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆయనను కేరళ రాష్ట్రంలో మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. ఆర్య సినిమా నుంచి మొదలుపెడితే పుష్ప -2 వరకు అన్ని సినిమాలు కేరళ రాష్ట్రంలో డబ్ అయ్యాయి. కేరళ రాష్ట్రంలో తనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని పుష్ప సినిమాలో ఫహద్ ఫజిల్ ను బన్వర్సింగ్ షెకావత్ పాత్రకు ఎంపిక చేశారు. ఫహద్ పజిల్ కు కేరళ రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అతడికి అభిమానులు ఉన్నారు. పుష్ప వివాదంతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా ఈ సినిమా కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమాలోని పాటలకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులు కూడా తమదైన శైలిలో స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.
‘పీలింగ్స్’ పాటకు లేడీ ప్రొఫెసర్ స్టెప్పులు!
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప–2’ సినిమాలోని పాటకు కొచిన్లోని ఓ యూనివర్సిటీలో మహిళా ప్రొఫెసర్ ఇటీవల విద్యార్థులతో కలసి ‘పీలింగ్స్’ పాటకు డ్యాన్స్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. pic.twitter.com/2VkACBacXe— ChotaNews (@ChotaNewsTelugu) December 23, 2024