China: అయితే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ప్రేమగా చూసుకుంటాయి.. మంచి వేతనాలు ఇస్తుంటాయి. పండుగల సమయాలలో ప్రత్యేకమైన బహుమతులతో సత్కరిస్తుంటాయి. ఇక వార్షికోత్సవాలు, పండుగల సందర్భాల్లో బోనస్ లు ఇస్తుంటాయి. ఇంక్రిమెంట్లు కూడా సక్రమంగా ఇచ్చి ఖుషి చేస్తుంటాయి. అలాంటి సమయాలలో ఉద్యోగులు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తుంటారు. అయితే ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు బోనస్ కాకుండా.. ఇంక్రిమెంట్ కాకుండా బంపర్ ఆఫర్ ఇచ్చింది. కోలుకోలేని ఆనందాన్ని కళ్ళ ముందు ఉంచింది. టేబుల్ పై ఏకంగా 70 కోట్లను అలా కుమ్మరించేసింది. నగదు తీసుకునే ముందు వారికి ఒక షరతు విధించింది.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియో ప్రకారం.. చైనాలో హెవాన్ మైనింగ్ క్రేన్ కో అనే ఒక కంపెనీ ఉంది. ఇది లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ ఉద్యోగుల ముందు అత్యంత పొడవైన టేబుల్ ఏర్పాటు చేసింది. దానిపైన 70 కోట్ల రూపాయలను కుమ్మరించేసింది. ఆ టేబుల్ చుట్టూ ఉద్యోగులను నిలబెట్టింది. ఆ డబ్బులను తీసుకునే ముందు వారికి ఒక షరతు విధించింది. 15 నిమిషాల పాటు సమయాన్ని ఉద్యోగులకు ఇస్తూ.. ఆలోగా ఎంత డబ్బు లెక్కపెడితే.. అంత డబ్బును ఇంటికి తీసుకెళ్లొచ్చు అని సూచించింది.. దీంతో ఆ షరతు విన్న ఉద్యోగులు.. ఒక్కసారిగా ఆనందానికి గురయ్యారు. ఈ పని బాగుందని లోలోపల అనుకుంటూ తమ చేతులకు పని చెప్పారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే వారి సామర్థ్యానికి మించి (employees counted cash) డబ్బును లెక్కపెట్టారు. ఆ కట్టలను తమ బ్యాగులో వేసుకున్నారు. ఇక కొంతమంది అయితే ఆ డబ్బును లెక్కపెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డారు. మరికొందరేమో వేగంగా నగదు లెక్కించి ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. ఒక ఉద్యోగి అయితే కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే 11 లక్షల పైగా నగదును లెక్క పెట్టాడు. మొత్తానికి ఆ కంపెనీ చిత్ర విచిత్రమైన షరతు విధించి.. ఉద్యోగులకు ఆఫర్ ఇవ్వడం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..” ఇదేదో బాగుంది. ఆఫర్ భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని” వ్యాఖ్యానిస్తుంటే.. ” డబ్బుకు తగ్గట్టుగానే పని ఒత్తిడి కూడా ఉంటుందని” ఇంకొందరు పేర్కొంటున్నారు. ఇక ఈ వీడియో ఇప్పటివరకు వేలాది లైక్ లు సొంతం చేసుకుంది. 1.7 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
View this post on Instagram