Whale: సినిమాల్లో మాత్రమే కనిపించే భారీ తిమింగలం బయట చూసే అవకాశం దాదాపు ఉండదు. ఎందుకంటే ఇవి సముద్రంలో ఎక్కడో ఉంటాయి. ఇవి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఓ భారీ తిమింగలం సముద్రపు ఒడ్డుకు కొట్టుకుచ్చింది. ఇది రెండు రోజుల కిందటే మరణించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ భారీ తిమింగలం సముద్రంపు ఒడ్డుకు వచ్చిందని తెలియగానే చాలా మంది అక్కడికి చేరుకొని ఫొటోలు, వీడియోలు తీయ సాగారు. ఇంతకీ ఇది ఎక్కడోతెలుసా?
కేరళ లోని కోచికోడ్ బీచ్ ఇటీవల జనసంద్రంతో నిండిపోయింది. వీరంతా బీచ్ చూడడానికి రాలేదు. ఇక్కడ భారీ తిమింగలం కొట్టుకురావడమే. ఈ తిమింగలం 50 అడుగుల పొడవుగా ఉంది. 2023 సెప్టెంబర్ 30న ఈ తిమింగలం ఇక్కడికి రావడంతో స్థానికంగా ఉండే జాలర్లు గుర్తించారు. వెంటనే ఆరోగ్య అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే ఆరోగ్య శాఖ అధికారి ప్రమోద్ బీచ్ కు చేరుకొని తిమింగలాన్ని పరిశీలించారు. ఈ తిమింగలం చనిపోయి అప్పటికి రెండో రోజులు అయినట్లు తెలిపారు.
ఆ తరువాత ప్రోటోకాల్ ప్రకారం దానిని అక్కడే పూడ్చి పెట్టారు. అయితే ఇలాంటి తిమింగలాన్ని సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇలా రియల్ గా కనిపించడం అరుదు. అందువల్ల దీనిని చూడడానికి జనం భారీగా తరలి వచ్చారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ హల్ చల్ చేశారు. అయితే కొందరు అధికారులు తిమింగలం వద్దకు వెళ్లొద్దంటూ హెచ్చరిస్తున్నారు. దగ్గరికి వెళితే పేలిపోతుందంటూ హెచ్చిస్తున్నారు. అయినా కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ తిమింగలం ఎందుకు చనిపోయింది? అని కొందరు ఆరా తీస్తున్నారు.
View this post on Instagram