
Young Woman Married Old Man: ప్రేమకు హద్దులు ఉండవు. అంతరాలు అంతకంటే కనిపించవు. వయసులో తేడాలు కూడా పట్టించుకోదు. ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమకు ఉన్న మహత్యం అలాంటిది మరి. ఇలా ప్రేమ గురించి చెబితే ఎంత చెప్పినా తక్కువే. ఈ నేపథ్యంలో ప్రేమకు ఏదీ అడ్డురాదని నిరూపించారు. సాధారణంగా వయసులో ఉన్న వారు వివాహం చేసుకోవడం మామూలే. కానీ తాత వయసున్న వాడిని 24 ఏళ్ల యువతి పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తనకంటే ఎంతో చిన్న వయసున్న యువతిని మనసుపడి పెళ్లి చేసుకుని ఒక్కటి కావడం గమనార్హం.
అమెరికాకు చెందిన మిరాకిల్ పోగ్ అనే 24 ఏళ్ల యువతి 85 ఏళ్ల చార్లెస్ అనే వృద్ధుడిని పెళ్లి చేసుకుంది. 2019లో మిరాకిల్ లాండరెట్ లో పని చేస్తున్నప్పుడు తొలిసారి ఆ వృద్ధుడిని కలిసింది. తొలిచూపులోనే అతడిపై మనసు పారేసుకుంది. దీంతో వారి మధ్య పరిచయం పెరిగింది. ఆమెతో సన్నిహిత్యం పెరగడంతో అతడే తన ప్రేమను వ్యక్తం చేశాడట. దానికి ఆమె మురిసిపోయిందట. కానీ ఇంట్లో వారు మాత్రం ఒప్పుకోలేదు. మిరాకిల్ తండ్రి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆమె తండ్రి వయసు 47, తల్లి వయసు 46 మాత్రమే.
ఆమెకు అతడికి దాదాపు 61 సంవత్సరాల తేడా ఉంది. 2020 ఫిబ్రవరిలోనే అతడు ఆమెకు ప్రపోజ్ చేశాడట. అదే ఏడాది జులైలో వీరి వివాహం జరిగింది. చార్లెస్ ను వరించి పెళ్లి చేసుకుని అందరిలో ఆశ్చర్యం నింపింది. చార్లెస్ ను వివాహం చేసుకున్న మిరాకిల్ ను సంతోష పెట్టడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. తమకు సంతానం కావాలని ఆశపడుతున్నారు. చార్లెస్ తన భార్యకు సంతాన వరం ఇవ్వాలని చూస్తున్నాడు. దీంతో అతడి కోరిక తీరుతుందా అనేది సందేహమే. ఈ వయసులో చార్లెస్ కు అంతటి మహద్భాగ్యం దక్కుతుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. ఓ వృద్ధురాలిని యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన జరిగిన నేపథ్యంలో ఇప్పుడు వీరి వివాహం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వయసులో పెళ్లి చేసుకోవడమే ఎక్కువ అంటే ఇంకా సంతానం కోసం ఆశ పెంచుకోవడం అతిగా ఉందని అంటున్నారు. మొత్తానికి చార్లెస్, మిరాకిల్ జంటకు నెట్టింట్లో చాలా మంది తమదైన శైలిలో ట్వీట్లు చేస్తున్నారు. చార్లెస్, మిరాకిల్ జంట ఏం అద్భుతాలు చేస్తుందోనని వ్యాఖ్యానిస్తున్నారు.