Sai Kumar Voice: భాషా టు పెదరాయుడు.. రజినీకి సాయికుమార్ వాయిస్ ఇచ్చిన సినిమాలేంటో తెలుసా?

Sai Kumar Voice: సినిమాల్లో ఒక పాత్రకే పరిమితమైపోయేవారు కొందరు ఉంటారు. వారు హీరోగానే చేసి రిటైర్ అయిపోతుంటారు. శోభన్ బాబు హీరోగా తప్పితే వేరే క్యారెక్టర్ చేయనని ఏకంగా సినిమాల నుంచి రిటైర్ అయిపోయారు. కానీ ఈయన అలాకాదు.. హీరో విలన్ నుంచి మొదలుపెడితే సకల క్యారెక్టర్లు చేసి సకల కళా వల్లబుడిగా ఆరితేరిన నటుడు ఒకరు ఉన్నారు. ఆయన ఒక విలన్.. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్.. ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ […]

Written By: NARESH, Updated On : April 6, 2022 12:41 pm
Follow us on

Sai Kumar Voice: సినిమాల్లో ఒక పాత్రకే పరిమితమైపోయేవారు కొందరు ఉంటారు. వారు హీరోగానే చేసి రిటైర్ అయిపోతుంటారు. శోభన్ బాబు హీరోగా తప్పితే వేరే క్యారెక్టర్ చేయనని ఏకంగా సినిమాల నుంచి రిటైర్ అయిపోయారు. కానీ ఈయన అలాకాదు.. హీరో విలన్ నుంచి మొదలుపెడితే సకల క్యారెక్టర్లు చేసి సకల కళా వల్లబుడిగా ఆరితేరిన నటుడు ఒకరు ఉన్నారు. ఆయన ఒక విలన్.. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్.. ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా.. ఇదంతా విన్నాక మీకు ఆయన ఏ ఆర్టిస్ట్ అనేది ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.

కనిపించని ఆ నాలుగో సింహమే రా ఈ పోలీస్ అని ఆయన థియేటర్ లో చెప్పిన డైలాగ్ ఇప్పటికే ఫేమస్. సైడ్ క్యారెక్టర్ రోల్స్ తో కెరీర్ స్ట్రాట్ చేసి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరోగా .. సపోర్టింగ్ రోల్స్ లో ది బిస్ట్ ఇచ్చే యాక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఉంది. ఆయన ఎవరో కాదు సాయి కుమార్..

Also Read: RRR Movie Box Office Collections: ‘ఆర్ఆర్ఆర్’ ఎక్కడ అత్యధిక వసూళ్లు సాధించిందో తెలుసా ?

అయితే ఇవన్నీ ఒక ఎత్తు.. సాయి కుమార్ తోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు వినగానే ఫస్ట్ అందరికీ గుర్తుకు వచ్చేది వాళ్ల పవర్ ఫుల్ వాయిస్ యే.. అవును శర్మ అయినా.. సాయికుమార్ , రవిశంకర్ సోదరులు అయినా వారి గురించి సపరేట్ గా చెప్పకుండానే వాళ్ల డబ్బింగ్ ఎంత ప్రొఫెషనల్ గా .. గంభీరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.

అయితే సాయికుమార్ ఎప్పటి నుంచో ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన హీరో రాజశేఖర్ కు పర్మనెంట్ వాయిస్ ఇస్తుంటారు. ఇక ఆయనకే కాదు..మిగతా హీరోలకు.. కొన్ని పాపులర్ సినిమాలకు కూడా డబ్బింగ్ చెబుతుంటాడు. సాయికుమార్ డబ్బింగ్ ఇచ్చిన కొందరికి తెలియని మూవీల గురించి ఇప్పుడు చూద్దాం..

-భాషా సినిమాలో రజినీకాంత్ కు సాయికుమార్ యే వాయిస్ ఇచ్చాడు.

-అంకుషం సినిమాలో రాజశేఖర్ కు వాయిస్ ఇచ్చాడు.

-ఆహుతి మూవీలో కూడా రాజశేఖర్ వాయిస్ సాయికుమార్ దే..

-సితార సినిమాలో హీరో సుమన్ కు సాయికుమార్ వాయిస్ నే వాడారు.

-అల్లరి ప్రియుడు మూవీలోనూ రాజశేఖర్ కు సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు

-పెదరాయుడు మూవీలో రజినీకాంత్ కు సాయికుమార్ వాయిస్ ఇచ్చాడు.

-బావ బావమరిది సినిమాలో హీరో సుమన్ కు సాయికుమార్ వాయిస్ ఇచ్చారు.

-ఎవడైతే నాకేంటి మూవీలో రాజశేఖర్ కు సాయికుమార్ వాయిస్ నే పెట్టారు.

-పీఎస్.వీ గరుడవేగ సినిమాలో రాజశేఖర్ వాయిస్ సాయికుమార్ దే..

Also Read:IMDB : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలు ఇవే