spot_img
Homeజాతీయ వార్తలుYS Sharmila: అమెరికాకెళ్లి తెలంగాణపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు.. వైరల్‌!

YS Sharmila: అమెరికాకెళ్లి తెలంగాణపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు.. వైరల్‌!

YS Sharmila: తెలంగాణ కోడల్ని.. నేను ఎవరూ వదిలిన బాణాన్ని కాదు.. అంటూ తెలంగాణలో పార్టీ పెట్టారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల. పార్టీ కోసం 3 వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారు. తర్వాత చేసుకున్న కీలక పరిణామాలతో కాస్త సైలెంట్‌ అయ్యారు షర్మిల. తాజాగా అమెరికా వెళ్లిన ఆమె తెలంగాణలో రాజకీయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ప్రజల మేలు కోసం పోరాడాలి అని నాన్న తన గుండెలపై విల్లు రాశారు’ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అమెరికాలో వ్యాఖ్యానించారు. ఆమెరికా పర్యటనలో ఉన్న ఆమె కాపెల్‌లోని ఓ హోటల్‌లో పార్టీ సానుభూతిపరులతో సమావేశమయ్యారు. ‘తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు’ అని నాన్న నాకు చెప్పినట్లు అనిపించిందని.. ‘తెలంగాణ ప్రజలను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని నాన్న చెప్పారని అన్నారు. తనును ప్రేమించిన ప్రజలు.. నేను ప్రేమించిన ప్రజలు అని నాన్న చెప్పాడని.. అందుకే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పెట్టానన్నారు. వైఎస్సార్‌ పార్టీ జెండాలో వైఎస్సార్‌ ఉన్నాడు.. అజెండాలో వైఎస్సార్‌ సంక్షేమం ఉందని.. మళ్లీ రాజన్న పాలన తీసుకొస్తామని తెలిపారు. ‘ఇవ్వాళ వైఎస్సార్‌ బతికి ఉన్నా.. తెలంగాణ ముఖ్యమా..? ఆంధ్రా ముఖ్యమా అంటే సమాధానం చెప్పలేకపోయేవారని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌ను అమితంగా ప్రేమించిన తెలంగాణ ఈరోజు ఎలా ఉందో అందరూ గమనించాలన్నారు.

YS Sharmila
YS Sharmila

ఉద్యమకారుడని నమ్మితే..
ఉద్యమ కారుడు కదా అని తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని విమర్శలు గుప్పించారు. ఎనిమిదిన్నర ఏళ్ల కేసీఆర్‌ పాలనలో 8 వేల మంది రైతులు, వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ ప్రారంభించిన ఒక్క పథకం తెలంగాణలో అమలు కావడం లేదన్నారు. వైఎస్సార్‌ ఐదేళ్లే సీఎంగా ఉన్నా ప్రజల గుండెల్లో ఉండిపోయేలా పాలన చేశారని తెలిపారు.

YS Sharmila
YS Sharmila

పాదయాత్రకు అనుమతి..
షర్మిల పాదయాత్రను నర్సంపేట వద్ద బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్న తర్వాత కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. అయితే తర్వాత వ్యక్తిగత పర్యటన, పండుగల కారణంగా అమెరికా వెళ్లారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తారు. అమెరికా తెలుగు వారు ఎక్కువగా ఉండే డాల్లాస్‌ దగ్గర కాపెల్‌ సిటీలోని ఓ హోటల్‌లో షర్మిల సన్నిహితులు సమావేశం ఏర్పాటు చేశారు. ఉచిత భోజనం, పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటు చేసి.. కుటుంబంతో కలి సి రావాలని పెద్ద ఎత్తున ఆహ్వానాలు పంపారు. అయితే చాలా పరిమిత సంఖ్యలోనే హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు కూడా హాజరు కాలేదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version