https://oktelugu.com/

Jr NTR Remuneration : 30 సెకండ్స్  లో 8 కోట్లు..ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైన రికార్డు ఇది!

రీసెంట్ గా ఈ యాడ్ ప్రసారం అవ్వగా దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 30 సెకండ్స్ నిడివి ఉన్న ఈ యాడ్ కి ఎన్టీఆర్ ఏకంగా 8 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో అందరి కంటే హైయెస్ట్ యాడ్ రెమ్యూనరేషన్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : June 11, 2023 / 06:08 PM IST
    Follow us on

    Jr NTR Remuneration : మన టాలీవుడ్ హీరోలు ఇక నుండి టాలీవుడ్ హీరోలు కాదు..పాన్ ఇండియన్ హీరోలు, ఒక్క పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు తప్ప అందరి స్టార్ హీరోలు పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టారు. ఈ ఇద్దరి హీరోలు కూడా తమ తర్వాతి సినిమాలతో పాన్ ఇండియన్  మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక #RRR చిత్రం తో ఎన్టీఆర్ కి పాన్ వరల్డ్ రేంజ్ లో ఎలాంటి గుర్తింపు లభించిందో అందరికీ తెలిసిందే.

    టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు దర్శక నిర్మాతలు ఎన్టీఆర్ డేట్స్ కోసం క్యూ కట్టేస్తున్నారు. ఆ రేంజ్ బ్రాండ్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ ని మన ప్రముఖ కంపెనీలు వాడుకోకుండా ఎందుకు ఉంటాయి?, నేషనల్ వైడ్ గా ఎంతో ప్రఖ్యాతి గాంచిన మెక్ డొనాల్డ్స్ సంస్థ రీసెంట్ గా తమ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టుకుంది.

    రీసెంట్ గా ఈ యాడ్ ప్రసారం అవ్వగా దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 30 సెకండ్స్ నిడివి ఉన్న ఈ యాడ్ కి ఎన్టీఆర్ ఏకంగా 8 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో అందరి కంటే హైయెస్ట్ యాడ్ రెమ్యూనరేషన్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

    8 కోట్ల రెమ్యూనరేషన్ సీనియర్ హీరోలు మరియు మీడియం రేంజ్ హీరోలు ఒక సినిమాకి తీసుకున్న ఈ రోజుల్లో, ఎన్టీఆర్ కేవలం 30 సెకండ్ల యాడ్ వీడియో కోసం తీసుకున్నదంటే ఆయన రేంజ్ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.