
Pawan Kalyan – Sai Dharam Tej Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తమిళం లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యనే ప్రారంభమైన సంగతి తెలిసిందే.హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లో బలమైన సెక్యూరిటీ మధ్య , ఎలాంటి ఫోటోలు లీక్ కాకండా మూవీ షూటింగ్ ని జరుపుతున్నారు.
నిన్న గాక మొన్న షూటింగ్ ప్రారంభం అయ్యిందో లేదో, అప్పుడే ఈ సినిమా గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది.ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం రోజు విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలు సోషల్ మీడియా లో ట్రేండింగ్ అవుతున్నాయి.ఇప్పుడు రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించేలా చేస్తుంది.అదేంటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తున్నాడు.మూవీ టైటిల్ కూడా ‘దేవర’ అని పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.అంతే కాకుండా ఇందులో పవన్ కళ్యాణ్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు అట, కొన్ని సన్నివేశాల్లో స్టైలిష్ గాను, కొన్ని సన్నివేశాల్లో ఊర మాస్ గాను ,మరికొన్ని సన్నివేశాల్లో పూర్తిగా ఎమోషనల్ గాను కనిపించబోతున్నాడట.రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన సినిమాలలో ఇది బెస్ట్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాని ఆగష్టు 11 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు,పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 20 రోజుల డేట్స్ ని కేటాయించాడు, ఏప్రిల్ నెలాఖరు లోపు షూటింగ్ మొత్తం పూర్తి కాబోతుందని వినికిడి.అంతే కాకుండా ఉగాది కానుకగా ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చెయ్యబోతున్నట్టు టాక్.ఇక ఫ్యాన్స్ ప్రతీ వారం ఈ సినిమా నుండి ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందట.