Gurugram Police: మన సంస్కృతి గురించి.. మన సంప్రదాయం గురించి ప్రపంచ దేశాలకు చెప్పడానికి విదేశీ యాత్రికులు వస్తుంటారు. అసలే ఇప్పుడు సోషల్ మీడియా రోజులు కాబట్టి.. ఇన్ ఫ్లూయన్ సర్స్ హడావిడి పెరిగిపోయింది. ప్రతి దాన్ని కూడా ప్రజలు సోషల్ మీడియాలో చెక్ చేసుకున్న తర్వాతే ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు..ఇన్ ఫ్లూయన్ సర్స్ వల్ల పర్యాటకంగా ఆదాయం కూడా బాగా వస్తుందని మన దేశ ప్రభుత్వం భావిస్తోంది. అందువల్లే ఇన్ ఫ్లూయన్ సర్స్ కు ఘన స్వాగతం పలుకుతోంది.
Also Read: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? గులాబీ గూడు పుఠాణిని బయట పెడతారా?
మనదేశంలో ఖరీదైన నగరాలలో గురు గ్రామ్ ఒకటి. ఈ నగరంలో విశిష్టమైన ప్రాంతాలు ఉంటాయి. కాంటినెంటల్ నుంచి మొదలుపెడితే వెస్ట్రన్ వరకు ఫుడ్ లభిస్తుంది. రకరకాల నేపధ్యాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివాసం ఉంటారు. ఈ నగరంలోని కొన్ని ప్రాంతాలు పూర్తి వెస్ట్రన్ ఏరియాలు గా కనిపిస్తుంటాయి. ఇక్కడి హోటల్స్ లో విదేశీ యాత్రికులు నెలల తరబడి ఉంటారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి సరికొత్తగా చూపించడానికి విదేశీ యాత్రికులు వస్తుంటారు. అలా వచ్చిన ఓ విదేశీ యాత్రికుడికి తీవ్రమైన పరాభవం ఎదురయింది.
జపాన్ దేశస్థుడి నుంచి వాహనాల రాకపోకలను పర్యవేక్షించే రక్షక భటులు వెయ్యి వరకూ లంచం తీసుకుంటూ కెమెరాలకు చిక్కారు.. పిలియన్ రైడర్ కు హెల్మెట్ లేదని అభియోగాలు మోపుతూ పోలీసులు 1000 అపరాధ రుసుం విధించారు. ఏటీఎం కార్డు ద్వారా చెల్లిస్తామని సదరు యాత్రికుడు చెప్పగా.. దానికి కానిస్టేబుల్ ఒప్పుకోలేదు. పైగా కోర్టుకు వెళ్లి చెల్లించాలని హెచ్చరించాడు. దీంతో ఆటోరిస్ట్ అసహనం వ్యక్తం చేశాడు. వెయ్యి రూపాయలు డబ్బులు చెల్లించాడు. వెయ్యి రూపాయలు తీసుకున్న తర్వాత ఆ పోలీస్ అతడిని వదిలిపెట్టాడు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పడి రచ్చ రచ్చ అయ్యింది. ఫలితంగా అధికారులు ఆ కానిస్టేబుల్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనిచేయడం ఏంటని సోషల్ మీడియాలో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విదేశీ యాత్రికుడి దగ్గర నుంచి లంచం తీసుకోవడానికి సిగ్గు లేదా అంటూ మండిపడుతున్నారు. కేవలం 1000 రూపాయల కోసం కక్కుర్తి పడితే.. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడు ఏటీఎం కార్డు ద్వారా చెల్లింపులు చేస్తానని చెప్పినప్పుడు కానిస్టేబుల్ ఊరుకుంటే సరిపోయేదని.. డబ్బుల కోసం అతడు పడిన కక్కుర్తి వల్ల ఇంతటి చర్చ జరుగుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అతని మీద సస్పెన్షన్ వేటు విధించిన నేపథ్యంలో.. ప్రభుత్వం అంతకుమించి చర్యలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది.
View this post on Instagram