Virupaksha Movie Record: బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నుండి కొత్త సినిమా విడుదల కాలేదు.దీనితో ఆయనని అభిమానించే వాళ్ళు బాగా నిరాశకి గురయ్యారు.ఇప్పుడు మళ్ళీ ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడం తో చాలా కాలం తర్వాత ‘విరూపాక్ష’ అనే సినిమా ద్వారా మన ముందుకి రాబోతున్నాడు.ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించగా కార్తీక్ వర్మ దండు అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అవ్వబోతున్నాడు.కొంత కాలం క్రితమే ఈ సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు.
Also Read: Ram Charan Instagram Post: దేశాన్ని ఊపేస్తున్న రామ్ చరణ్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ రీల్
ఈ గ్లిమ్స్ వీడియో కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.చిన్న గ్లిమ్స్ తోనే ఆడియన్స్ లో ఈ చిత్రం పై ఆసక్తి పెంచేలా చేసాడు.దీనితో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ రేట్స్ కి అమ్ముడుపోతున్నట్టు సమాచారం.
ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి 22 కోట్ల రూపాయలకు కొనుగోలు చెయ్యడానికి ముందుకొచ్చాడు.ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.కేవలం 56 సెకండ్ల వీడియో తో మార్కెట్ లో ఇంత బజ్ క్రియేట్ అయ్యిందంటే , రాబొయ్యే రోజుల్లో టీజర్ మరియు ట్రైలర్ తో ఈ సినిమా ఇంకా ఎంత క్రేజ్ ని దక్కించుకోబోతుందో చూడాలి.గత కొంతకాలం నుండి సాయి ధరమ్ తేజ్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.
ఆయన చివరి చిత్రం ‘రిపబ్లిక్’ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు.అందుకే ఈసారి పాన్ ఇండియా రేంజ్ స్కోప్ ఉన్న కథతో ఎలా అయినా బాక్స్ ఆఫీస్ దున్నేయాలనే కసితో బరిలోకి దిగుతున్నాడు.మరి ఆయన ఈ చిత్రం ద్వారా భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Also Read: Waltair Veerayya Records: 250 సెంటర్స్ లో 50 రోజులు..’వాల్తేరు వీరయ్య’ ఖాతాలో మరో రికార్డు