
Tarakaratna Wife: నందమూరి వారసుడు, సినీ హీరో తారకరత్న మరణం కుటుంబ సభ్యులను, సినీ ఇండస్ట్రీని తీవ్రంగా కలిచివేసింది. ఇక ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఓ వైపు భర్త అకాల మరణం అన్న శోకంతో పాటు తనకున్న పిల్లల భవిష్యత్ ఎలాగా? అన్న ఆలోచనలో పడ్డారు. అయితే తారక్ చనిపోయి రెండు రోజులు కూడా గడవకుముందే అలేఖ్యరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఆమె తీసుకున్న నిర్ణయానికి బాలకృష్ణ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ షాక్ తింటున్నారట. ఈ సమయంలోనూ అలేఖ్య అలాంటి పట్టుదలతో ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారట. ఇంతకీ అలేఖ్య తీసుకున్న నిర్ణయం ఏంటి? జూనియర్, బాలయ్యలు ఎందుకు షాక్ అయ్యారు?
తారకరత్న, అలేఖ్యల పెళ్లి ఎవరికీ ఇష్టం లేకుండానే జరిగింది. తారక్ తండ్రి మోహనకృష్ణ తో పాటు కొందరు నందమూరి వంశానికి చెందిన వారు ఈ వివాహాన్ని వ్యతిరేకించారు. అయితే తారక్ మాత్రం అలేఖ్యపై ఏమాత్రం ప్రేమను తగ్గించలేదు. అన్నీ తానై భార్య, పిల్లలను చాలా చక్కగా చూసుకున్నారు. కానీ కుటుంబ పెద్దగా ఉన్న తారక్ ఒక్కసారిగా మరణించడంతో అలేఖ్యరెడ్డి ఒక్కసారిగా కుంగిపోయారు. తన కుటుంబాన్ని చూసుకునే తారక్ ఇప్పుడు లేకపోవడంతో పిల్లల పరిస్థితి ఏంటి? అన్న దీనవస్థలో ఉన్నారు. అయితే ఈ బాధను దిగమింగుకుంటూనే ఆమె పట్టుదలతో ముందుకెళ్తున్నారు.
తారక్ సినీ హీరో కాగా.. అలేఖ్య రెడ్డి ఫ్యాషన్ డిజైనర్. తారక్ నటించిన ‘నందీశ్వరుడు’ సినిమాకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేశారు. వీరిద్దరు పెళ్లి చేసుకున్న తరువాత అలేఖ్య రెడ్డి ఒక ‘బుటిక్యూ’ను నడుపుతుండేవారు. సెలబ్రెటీస్ కు ఆమె పలు వెరైటీ దుస్తులను అందిస్తూ ఉండేవారు. అయితే పిల్లలు పుట్టిన తరువాత కుటుంబానికే పరిమితం అయ్యారు. దీంతో బుటిక్యూ నిర్వహణకు పులిస్టాప్ పెట్టారు. ఇప్పుడు అలేఖ్యరెడ్డి మళ్లీ బుటిక్యు నిర్వహణకు రెడీ అవుతున్నారు. తారక్ దంపతులకు పుట్టిన పిల్లలను పెంచిపోషించే బాధ్యత ఇప్పుడు అలేఖ్యరెడ్డిదే. దీంతో ఆమె తన బాధ్యతను నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం అలేఖ్య రెడ్డి తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. కొన్ని రోజుల తరువాత మళ్లీ ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా మారబోతున్నారు. ఈ తరుణంలోనే ఆమె తన పిల్లల బాగోగులూ చూసుకోనున్నారు. వీరిలో ఒకరు చిన్న బాబు ఉన్నారు. ఆయనను తనదగ్గరే ఉంచుకుంటూ షాప్ నిర్వహించనున్నారు. అంటే బుటిక్యూ నిర్వహిస్తూనే తన పిల్లల కోసం ప్రత్యేకంగా రెండు గదులు కేటాయిస్తారని అనుకుంటున్నారు. ఓ వైపు బుటిక్యూ నిర్వహణతో పాటు మరోవైపు తన పిల్లల బాగోగులూ చూసుకునేలా అలేఖ్యరెడ్డి ప్లాన్ వేస్తున్నారు.

తారక్ చనిపోయిన రెండు రోజులకే అలేఖ్య రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యలతో చెప్పిందట. దీంతో అలేఖ్య ధైర్యాన్ని చూసి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు షాక్ అవుతున్నారట. నేటి కాలంలో భర్త మరణంతో ఏం చేయాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. కానీ అలేఖ్య మాత్రం తన పిల్లల కోసం తానున్నానంటూ నిర్ణయం తీసుకోవడం అందరూ హర్షిస్తున్నారు. అంతేకాకుండా తమ సపోర్టు ఉంటుదని అటు నందమూరి ఫ్యామిలీ.. ఇటు ఆమె పుట్టినిల్లు ఫ్యామిలీ భరోసా ఇస్తున్నారట. ఏదీ ఏమైనా ఆమె నిర్ణయం పలువురికి ఆదర్శం అంటూ ప్రశంసిస్తున్నారు.