Viral Video: అది సమయం అర్ధరాత్రి 12 గంటలు దాటింది. ఒక 19 ఏళ్ల యువకుడు నడిరోడ్డుపై పరిగెత్తుతూ కనిపించాడు. నిర్మాత వినోద్ కాప్రి రోడ్డుపై కారులో వెళుతూ ఆ బాలుడిని ఎందుకు పరిగెడుతున్నావ్? అని ప్రశ్నించాడు. ఆ బాలుడు చెప్పిన సమాధానం విని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ వీడియోను షేర్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రి షేర్ చేసిన వీడియో పోస్ట్ అందరినీ కదిలించింది. ఈ వీడియోపై దిగ్గజ కంపెనీల సీఈవోల నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. కొన్ని లక్షల మందికి ఈ యువకుడు స్ఫూర్తిదాయకం అంటూ అందరూ కొనియాడుతున్నారు.
ఉత్తరాఖండ్ లోని అల్మోరాకు చెందిన 19 ఏళ్ల యువకుడు మధ్య రాత్రి నోయిడా రోడ్డుపై పరిగెత్తడం ఎంతో మంది హృదయాలను కదలించింది. ఈ నిరుపేద యువకుడి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. నిర్మాత వినోద్ కాప్రి ఈ వీడియోను షేర్ చేశారు. కార్ల దిగ్గజ సంస్థ మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ యువకుడి ఆత్మనిర్భర్ ను కొనియాడారు.
నోయిడా రోడ్డుపై మధ్యరాత్రి 12 గంటల సమయంలో ఒక 19 ఏళ్ల యువకుడు ‘ప్రదీప్ మెహ్రా’ బ్యాగ్ వేసుకొని పరిగెత్తుతూ కనిపించాడు. ఆ యువకుడు ఏదైనా ఇబ్బందుల్లో పడ్డాడేమోనని వినోద్ కాప్రి కారును ఆపి లిఫ్ట్ కావాలా? అని అడిగాడు. కానీ ఆ యువకుడు తిరస్కరించాడు. కారణం ఏంటి అని అడిగితే అతడు ఇచ్చిన సమాధానం విని నిర్మాత వినోద్ షాక్ అయ్యాడు.
తాను నోయిడాలోని మెక్ డొనాల్డ్ అవుట్ లెట్ లో పనిచేస్తానని.. తాను బరోలాలో ఉన్న తన ఇంటికి చేరుకోవడానికి 10 కి.మీల వరకూ ఇలానే పరిగెడుతానని ప్రదీప్ తెలిపాడు. ఇండియన్ ఆర్మీలో చేరాలనే తన కలకు ఇది ఎక్సర్ సైజ్ అని వివరించాడు. ఉదయం లేచి పరిగెత్తే సమయం లేకపోవడంతోనే ఇలా రాత్రి పరిగెత్తుతున్నానని ప్రదీప్ తెలిపాడు. నిర్మాత వినోద్ కారులో లిఫ్ట్ ఇచ్చి ఈరోజు దింపుతానన్న ప్రదీప్ తిరస్కరించడం విశేషం.
#PradeepMehra आज रात 12 बजे – फिर से ❤️ https://t.co/8cDE8gR94m pic.twitter.com/5xo8mmf5uJ
— Vinod Kapri (@vinodkapri) March 20, 2022
మా అమ్మ అనారోగ్యం పాలైందని.. సోదురుడితో కలిసి ఉంటున్నానని ప్రదీప్ తెలిపాడు. ఇప్పుడు అర్థరాత్రి వెళ్లి వంట చేసుకొని తినాలని వివరించాడు. భోజనం ఆఫర్ చేసిన నిర్మాతకు సున్నితంగా తిరస్కరించాడు. తన అన్న ఆకలితో వస్తాడని.. తాను నైట్ షిఫ్ట్ కు వెళ్తాడని.. అందుకే నేనే వంట చేసి పెట్టాలని వివరించాడు. నేనొక్కడినే తింటే మా అన్న ఆకలితో ఉంటానని నిర్మాత ఫుడ్ ఆఫర్ ను కూడా ప్రదీప్ వద్దనడం విశేషం.
ఇలా తన ఆశయం కోసం.. తన పేదరికం అధిగమించడం కోసం ఓ యువకుడు ఎంతలా తపన పడుతున్నాడో చూపించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై సెలబ్రెటీలు, పారిశ్రామిక ప్రముఖులు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రదీప్ సంకల్పాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 12 గంటల్లోనే 38 లక్షల వ్యూస్ దాటేసింది.