Homeట్రెండింగ్ న్యూస్Pakistan Swat River: నదిలో కొట్టుకుపోతున్నా వినోదం చూశారు.. పాక్ దేశ పరిపాలకులు, ఆర్మీ హృదయం...

Pakistan Swat River: నదిలో కొట్టుకుపోతున్నా వినోదం చూశారు.. పాక్ దేశ పరిపాలకులు, ఆర్మీ హృదయం లేని మనుషులు: వైరల్ వీడియో

Pakistan Swat River: భారతదేశానికి బుద్ధి చెబుతాం. భారతదేశానికి మా సత్తా ఏమిటో చూపిస్తాం. మావద్ద అణుబాబులున్నాయి. వాటి ద్వారా విధ్వంసం సృష్టిస్తాం. పాకిస్తాన్ పాలకుల భీషణ మాటలు ఇలానే ఉంటాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసిన విషయంలో చూపించిన శ్రద్ధ.. సౌకర్యాలు కల్పించడంలో చూపించారు. ప్రజలు ఆకలి దప్పులతో ఇబ్బంది పడుతున్నా సరే పట్టించుకోరు. ఉగ్రవాదులు విలయతాండవం చేస్తున్నా సరే పరిగణలోకి తీసుకోరు. వారికి కావాల్సింది డబ్బు, అధికారం మాత్రమే. ప్రజలు ఎలా ఉన్నా.. ఏమైపోయినా పట్టించుకోరు. పైగా ఆపత్కాలంలో పాక్ పాలకులు చేతులెత్తేసి వినోదం చూస్తుంటారు.

Also Read: గౌతమ్ గంభీర్ చూస్తుండగానే.. కోచ్ మీద పడి టీమిండియా ప్లేయర్ల కొట్లాట.. షాకింగ్ వీడియో

ఇప్పటికి సరిపడా గోధుమ నిల్వలు లేవు. దేశానికి 24 గంటల పాటు నిర్విరామంగా విద్యుత్ అందించే సామర్థ్యం లేదు. కనీసం తాగునీటి సౌకర్యం కల్పించే స్తోమత కూడా లేదు.. ఇక రోడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక ఇటీవల ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు పాకిస్తాన్ రక్షణ సామర్థ్యం ఎలా ఉందో ప్రపంచానికి మరోసారి తెలిసిపోయింది. కాలం చెల్లిన ఆయుధాలు.. నెత్తి మాసిన సామగ్రితో భారత్ మీద గెలవడానికి పాకిస్తాన్ విఫల ప్రయోగం చేసింది. ప్రపంచం ముందు నవ్వుల పాలైంది. వాస్తవానికి ఆ దేశ పరిపాలన మొత్తం ఆర్మీ చేతిలో ఉంటుంది. పేరుకు అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఉంటారు. కానీ వారి చేతిలో అధికారం ఏది ఉండదు. ఏ నిర్ణయం తీసుకునే అధికారం వారికి ఉండదు. పైకి ఏదో మేకపోతు గాంభీర్యం లాంటి మాటలు ఎన్నో చెబుతుంటారు.

పాకిస్తాన్లో సౌకర్యాలు అత్యంత దారుణంగా ఉంటాయి.. ప్రజలకు తాగేందుకు నీరు ఉండదు. తినడానికి తిండి ఉండదు. కనీసం అక్కడ బతికే హక్కు కూడా ఉండదు. జీవించే సౌలభ్యం మచ్చుకు కూడా కనిపించదు. దీనిని నిజం చేస్తూ ఇటీవల ఆ ప్రాంతంలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఆ సంఘటన సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. ఆ ఘటన వల్ల ఒక కుటుంబంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

ఇటీవల పాకిస్తాన్ దేశంలో వరదలు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని సియాల్కోట్ ప్రాంతంలో స్వాత్ నది ప్రమాదకరస్థాయిని మించి ప్రవహించింది. ఈ ప్రవాహంలో స్వాత్ ఏరియాకి చెందిన ఓ కుటుంబం చిక్కుకుపోయింది. తమను కాపాడాలని అధికారులను వేడుకుంది. ప్రభుత్వ పాలకులకు కన్నీటితో అభ్యర్థన పంపింది. గంటలపాటు ఎదురుచూసింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. అధికారుల నుంచి తోడ్పాటు లభించలేదు. చివరికి ఆ నది ప్రవాహంలో ఆ కుటుంబంలోని ఒక్కొక్కరు కొట్టుకుపోయారు. నది ప్రవాహం ధాటికి వారు తల దాచుకున్న మట్టి గడ్డ సైతం కొట్టుకుపోయింది. ఈ వీడియో నెటిజన్ల ను తీవ్రంగా కలచివేస్తోంది. పాకిస్తాన్ పాలకులకు, అక్కడి ఆర్మీకి హృదయం లేదని సోషల్ మీడియా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version