Pawan Kalyan Remuneration : రెండు సినిమాలకు 160 కోట్లు.. ఇండియాలోనే మొట్టమొదటి హీరోగా నిలిచిన పవర్ స్టార్

Pawan Kalyan Remuneration : ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు లాగ పవన్ కళ్యాణ్ ఏమి పాన్ ఇండియా హీరో కాదు, అయినా కానీ ఆయనకీ ప్రస్తుతం నిర్మాతలు ఇస్తున్న రెమ్యూనరేషన్స్ ని చూస్తే పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం అయిపోతుంది.మిగిలిన హీరోల సినిమాలు బాగుంటేనే ఓపెనింగ్స్ వస్తాయి,లాంగ్ రన్ వస్తుంది.కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కళ్ళు చెదిరిపొయ్యే రేంజ్ లో ఉంటాయి. ఎంత డిజాస్టర్ టాక్ వచ్చిన […]

Written By: NARESH, Updated On : February 22, 2023 8:42 pm
Follow us on

Pawan Kalyan Remuneration : ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు లాగ పవన్ కళ్యాణ్ ఏమి పాన్ ఇండియా హీరో కాదు, అయినా కానీ ఆయనకీ ప్రస్తుతం నిర్మాతలు ఇస్తున్న రెమ్యూనరేషన్స్ ని చూస్తే పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం అయిపోతుంది.మిగిలిన హీరోల సినిమాలు బాగుంటేనే ఓపెనింగ్స్ వస్తాయి,లాంగ్ రన్ వస్తుంది.కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కళ్ళు చెదిరిపొయ్యే రేంజ్ లో ఉంటాయి.

ఎంత డిజాస్టర్ టాక్ వచ్చిన మూడు రోజుల పాటు ఆయన సినిమాలకు థియేటర్స్ బయట హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతాయి.ఇక టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే విధంగా ఉంటుంది.ఆయనకీ ఇచ్చే రెమ్యూనరేషన్ కేవలం మొదటి రోజే 70 రికవరీ అయ్యిపోతాది.అందుకే రెమ్యూనరేషన్ విషయం లో పవన్ కళ్యాణ్ ఎంత డిమాండ్ చేసిన కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారు నిర్మాతలు.కొంతమంది నిర్మాతలు అయితే డేట్స్ ఇస్తానంటే బ్లాంక్ చెక్ రాసి ఇవ్వడానికి కూడా వెనకాడరు.

ఇక రీసెంట్ గా కొబ్బరికాయలు కొట్టిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రాలకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఈరోజు ఆయన తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియా ని ఊపేస్తున్నాయి.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల డేట్స్ కేటాయించాడు.ఈ 20 రోజులకు గాను ఆయన అందుకుంటున్న రెమ్యూనరేషన్ అక్షరాలా 60 కోట్ల రూపాయిలు అన్నమాట.

ఈ సినిమాతో పాటుగా #OG అనే చిత్రాన్ని కూడా ప్రారంభించిన సంగతి సంగతి అందరికీ తెలిసిందే.సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో నటిస్తున్నందుకు అక్షరాలా 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట పవన్ కళ్యాణ్.అలా రెండు సినిమాలకు కలిపి 160 కోట్ల రూపాయిల పారితోషికం అందుకుంటున్న ఏకైక టాలీవుడ్ హీరో గా పవన్ కళ్యాణ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.