New Year 2025: ప్రతి సంవత్సరం మనమందరం కలిసి ఒకసారి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. అర్ధరాత్రి 12 దాటగానే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ వేడుక జరుపుకుంటాం. ఒకరికొకరు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటాం. భూమి మీద ఉండే మనకు సంవత్సరానికి ఒకసారి న్యూ ఇయర్ వస్తుంది. అయితే మన భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తిరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు మాత్రం ఈరోజు అంటే న్యూ ఇయర్ రోజున 16 సార్లు న్యూ ఇయర్ వస్తుంది. ఎందుకంటే ఈ అంతరిక్ష కేంద్రం ఒక గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ప్రతి గంటన్నరలో ఒకసారి ఈ అంతరిక్ష కేంద్రం భూమిని చుట్టేస్తుంది. ఈ కారణంగా అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు ప్రతి 90 నిమిషాలకు ఒకసారి న్యూ ఇయర్ వస్తుంది. ప్రతిరోజు అంతరిక్ష కేంద్రం భూమిని 16 సార్లు చుడుతుంది. ఈ అంతరిక్ష కేంద్రంలో ప్రయాణించే వ్యోమగాములకు 45 నిమిషాలు పగలు అలాగే 45 నిమిషాలు చీకటి వస్తుంది. ఈ కారణంగా ప్రతి గంటన్నరలో పగలు, రాత్రి రెండు అయిపోతాయి. ఇలా అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు న్యూ ఇయర్ రోజున 16 పగళ్ళు, 16 రాత్రులను చూస్తారు. అందుకే అంతరిక్షం కేంద్రం లో ఉన్నవారికి 16 సార్లు న్యూ ఇయర్ వస్తుంది.
ఈ విధం గా భూమి మీద ఉండే మనం సంవత్సరానికి ఒకసారి న్యూ ఇయర్ జరుపుకుంటే భూమికి 400 కిలోమీటర్ల పైన ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోని వ్యోమగాములు లకు మాత్రం ఈ రోజు 16 సార్లు న్యూ ఇయర్ వస్తుంది.మీరు కూడా ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని మీ ఇంటి నుంచే లైవ్ లో వీక్షించవచ్చు. నిరంతరం యూట్యూబ్లో దీనికి సంబంధించి లైవ్ నడుస్తూనే ఉంటుంది. స్పేస్ స్టేషన్ లోని కెమెరాలను లైవ్ కి సెట్ చేయడం వలన అక్కడ జరుగుతున్న మొత్తాన్ని లైవ్ లో వీక్షించవచ్చు. లైవ్ లో మనకు ఏదో ఒక కెమెరా నుంచి నిరంతరం దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి.
భూమిపై ఉండే మేఘాలు, ఖండాలు, సముద్రం, లైటింగ్ వంటివి అన్నీ లైవ్ లో మనం వీక్షించవచ్చు.ఇలా అంతరిక్ష కేంద్రం లో జరిగే ప్రతిదీ మనం ఇంటి నుంచే చూడవచ్చు. ప్రస్తుతం భూమికి నాలుగు వందలు కిలోమీటర్లు పైన ఉండే అంతరిక్ష కేంద్రంలో నలుగురు వ్యోమగాములు ఉన్నారు. నాసా వారిలో సునీత విలియమ్స్, విల్ మోర్ లను మార్చిలో భూమి మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందుకు స్పేస్ ఎక్స్ సహాయం తీసుకుంటుంది నాసా. అయితే నిజానికి సునీత విలియం డిసెంబర్ లోనే భూమి మీదకు రావలసి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ ప్లాన్ ఆలస్యమైనట్టు తెలుస్తుంది.