Telugu Movies Releasing This Week: పెద్ద సినిమాలు లేకపోవడం.. సంవత్సరం కూడా ముగుస్తుండడంతో విడుదలకు ఎన్నో సినిమాలు ముందుకు వస్తున్నాయి.. వీటిల్లో చిన్న సినిమాలే అధికంగా ఉన్నాయి.. ముఖ్యంగా డిసెంబర్ 9న ఏకంగా 15 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రేక్షకులకు పసందైన ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాయి. వీటికి తోడు ఓటిటి లో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. దీంతో ఆయా నిర్మాణ సంస్థలు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నాయి.

ఇవీ విడుదలయ్యే సినిమాలు
*పంచతంత్రం.. ఈ సినిమాకు హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. ఇందులో బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మిక నటించారు.
*గుర్తుందా శీతాకాలం
సత్యదేవ్, తమన్నా, మేఘ ఆకాష్ నటించారు. నాగ శేఖర్ దర్శకత్వం వహించారు . కన్నడలోని ఒక సినిమాకు ఇది రీమేక్.
*ముఖచిత్రం
విశ్వక్సేన్, అయేష్ ఖాన్, ప్రియా వడ్లమాని నటించారు. గంగాధర్ దర్శకత్వం వహించారు.
*వీటితోపాటు ప్రేమదేశం, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్ జీ, రాజయోగం, డేంజరస్, విజాయానంద్, ఏపీ 04 రామపురం, ఐ లవ్ యు ఇడియట్, మనం అందరం ఒక్కటే, ఆక్రోశం, ఏయ్ బుజ్జి నీకు నేనే అనే సినిమాలు డిసెంబర్ 9న విడుదల కాబోతున్నాయి.

ఓటిటిల్లో
నెట్ ఫ్లిక్స్ లో నజర్ అందాజ్ డిసెంబర్ 4 నుంచి స్ట్రీమ్ అవుతున్నది.. సెబాస్టియన్ మానిస్కాల్సో డిసెంబర్ 6 ను, ది ఎలిఫెంట్ విస్పరర్స్ డిసెంబర్ 8న, క్యాట్ డిసెంబర్ 9న,మనీ హైస్ట్ 9 న స్ట్రీమ్ కాబోతున్నాయి.
*ఆహా లో ఊర్వశి వో,రాక్షసి వో డిసెంబర్ 9 నుంచి స్ట్రీమ్ కాబోతోంది.
*హాట్ స్టార్ లో మూవింగ్ విత్ మలైకా డిసెంబర్ 5 నుంచి స్ట్రీమ్ అవుతోంది. కనెక్ట్ డిసెంబర్ 7, ఫాల్ డిసెంబర్ 9 నుంచి స్ట్రీమ్ కాబోతున్నాయి.
*సోనీ లివ్ లో
లైక్ షేర్ సబ్స్క్రైబ్ డిసెంబర్ 9 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. రాయ్, ఫాదూ, విట్నెస్ కూడా అదే తేదీన స్ట్రీమ్ కాబోతున్నాయి.
*జీ5లో
మాచర్ల నియోజకవర్గం, బ్లర్, మాన్ సూన్ రాగా స్ట్రీమ్ కాబోతున్నాయి.
ఇక అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ ఆడమ్ డిసెంబర్ 10 నుంచి స్ట్రీమ్ కాబోతోంది.
ఒకేసారి ఇన్ని ఎందుకంటే
కోవిడ్ తర్వాత సినిమా రంగంలో చాలా మార్పులు వచ్చాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు గిరాకీ ఏర్పడింది. దీనికి తోడు పెద్ద సినిమాలు విడుదలయేటప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకవు.. దీంతో ఆ సినిమాలు మొత్తం ల్యాబ్ వద్ద మూలుగుతున్నాయి. పైగా కోవిడ్ వల్ల పెద్ద సినిమాల విడుదల తేదీల్లో మార్పులు జరిగాయి. దీనివల్ల చిన్న సినిమాలు అనివార్యంగా తప్పుకోవాల్సి వచ్చింది.. ప్రస్తుతం పెద్ద సినిమాలేవి లేకపోవడంతో చిన్న సినిమాలను వరుసగా విడుదల చేస్తున్నారు. ఎలాగూ మరికొద్ది రోజుల్లో ఏడాది ముగుస్తుంది కాబట్టి.. వెంట వెంటనే సినిమాలు విడుదల చేస్తున్నారు.