Homeటాప్ స్టోరీస్CM Revanth Reddy: రేవంత్ వదిలిపెట్టే రకం కాదు.. బీఆర్ఎస్ ఏం చేస్తుందో..

CM Revanth Reddy: రేవంత్ వదిలిపెట్టే రకం కాదు.. బీఆర్ఎస్ ఏం చేస్తుందో..

CM Revanth Reddy: కాలేశ్వరం విషయంలో భారత రాష్ట్ర సమితి చేస్తున్న ప్రచారానికి అడుగడుగునా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. గణాంకాలతో సహా చెబుతూనే ఉన్నారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టింది.. ప్రభుత్వం ఎంత వడ్డీ కట్టింది.. దక్కిన ప్రయోజనాలు.. ఎత్తిపోసిన నీళ్లు.. ఇలా ప్రతి అంశాన్ని కూడా అర్థమయ్యేలాగా రేవంత్ రెడ్డి వివరిస్తూనే ఉన్నారు.

భారత రాష్ట్ర సమితికి అర్థ బలం అధికంగా ఉండడం.. సోషల్ మీడియా ప్రచారానికి ప్రత్యేకమైన విభాగాలు ఉండడంతో.. కాలేశ్వరం లేకపోతే తెలంగాణకు నీళ్లు లేవు అన్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. వాస్తవానికి కాలేశ్వరం జలాలు రాకుండానే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరిగింది. పసుపు.. మిర్చి.. ఇతర పంటలు కూడా భారీగానే పండాయి. అయినప్పటికీ కాలేశ్వరం విషయంలో గులాబీ పార్టీ ప్రచారం చేస్తూనే ఉంది. మేడిగడ్డ ఎందుకు కృంగిపోయింది.. గతంలో ఇంజనీర్లు చేసిన హెచ్చరికలను కెసిఆర్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు.. మిగతా బరాజ్ లు సక్రమంగా ఉన్నాయా.. అనే విషయాలను గులాబీ పార్టీ కావాలని దాస్తోంది.

గులాబీ పార్టీ ఎన్ని రకాలుగా చేసినప్పటికీ రేవంత్ వెనకడుగు వేయడం లేదు. తాజాగా మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన గోదావరి జలాల విషయంలో రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే మహారాష్ట్ర వెళ్ళిపోతున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.. గోదావరి జలాల వినియోగం.. ఇతర వివాదాల పరిష్కారానికి సంబంధించిన చర్చలు సాగుతాయని సమాచారం.

ప్రధానంగా రేవంత్ భేటీలో తుమ్మిడి హట్టి కి సంబంధించిన చర్చ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా నెలన్నర క్రితం ముఖ్యమంత్రి రేవంత్ మహారాష్ట్ర సీఎం కు లేఖ రాశారు తుమ్మిడి హట్టి ద్వారా మెదక్.. కరీంనగర్.. ఆదిలాబాద్.. నిజామాబాద్.. జిల్లాల నీటి అవసరాలు తీరుతాయని ఆయన అందులో పేర్కొన్నారు.. అంతేకాదు తుమ్మడి హట్టి విషయంలో కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని.. మహారాష్ట్ర కూడా తెలంగాణకు అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 2 వేల ఎకరాల భూమి అవసరం అవుతుంది.

భూమి సేకరణ విషయంలో కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి తుమ్మిడి హట్టి నిర్మాణం విషయంలో దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో.. గులాబీ పార్టీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో కూడా అనేక రకాలుగా కోర్టు కేసులు వేసింది. ఇప్పుడు రివేంజ్ తీసుకునే అవకాశం వచ్చిందని గులాబీ పార్టీ భావిస్తోంది. తుమ్మిడి పార్టీ విషయంలో కూడా గులాబీ పార్టీ కేసులు వేసేందుకు వెనకాడదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular