Renuka Aradhya Success Story: జీవితం ఎప్పుడూ ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. లక్షల కోట్ల ఉన్న వ్యాపారి బికారిగా మారవచ్చు. బికారిగా ఉన్న వ్యక్తి లక్షల కోట్లకు అధిపతి కావచ్చు. ఎందుకంటే డబ్బు రాకడ అనేది ఏనుగు మింగిన వెలగ పండులో గుజ్జు లాంటిది. అందుకే చాలామంది డబ్బు అనేది స్థిరం కాదు, కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికీ వెళ్ళదని అంటుంటారు. చదువుతుంటే నరసింహ సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది కదా. సేమ్ ఈ డైలాగ్ మాదిరిగానే ఇతడి జీవితం కూడా మారిపోయింది. ఒకప్పుడు భిక్షాటన చేసిన అతను ఇప్పుడు ఏకంగా 40 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. తన కడుపు నింపుకోవడానికి ఇతరులను యాచించిన అతడు.. ఇప్పుడు ఏకంగా వందలమంది కడుపు నింపుతున్నాడు.
అతని పేరు రేణుక ఆరాధ్య. అతడు పుట్టింది కడు పేద కుటుంబంలో. తినడానికి తిండి ఉండేది కాదు. తలదాచుకోవడానికి ఇల్లు కూడా ఉండేది కాదు. చిన్నపాటి గుడిసెలో జీవనం సాగించేవారు. ఇటువంటి స్థితిలో పొట్ట నిప్పుకోవడం కోసం అతడు తన తండ్రితో కలిసి ఆలయాల ముందు భిక్షాటన చేసేవాడు. అయితే ఆలయాల ముందు అడుక్కోవడం మొదట్లో అతడికి అంతగా ఇబ్బంది కలిగించకపోయినప్పటికీ.. ఆ తర్వాత ఎందుకనో ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. ఆ తర్వాత యుక్త వయసులో కారు తోలడం నేర్చుకున్నాడు. అలా అక్రమక్రమంగా ఒక కారు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత దినదిన ప్రవర్తమానంగా ఎదిగాడు.. ఐటి రాజధానిగా పేరుపొందిన బెంగళూరులో కార్లను అద్దెకి తీసుకొని.. నడపడం ప్రారంభించాడు. తద్వారా ప్రవాసి క్యాబ్స్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ ద్వారా అతడి జీవితం ఒకసారిగా మలుపు తిరిగింది.
సొంతంగా కార్లను కొనుగోలు చేసి ప్రభాస్ క్యాబ్స్ సంస్థను మరింతగా విస్తరించాడు. ఏకంగా 40 కోట్ల కంపెనీగా దానిని రూపొందించాడు. ఫలితంగా నేడు ఆ కంపెనీ వందల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. అంతే స్థాయిలో కుటుంబాలకు కడుపు నింపుతోంది. ఒకప్పుడు ఆలయాల వద్ద అడుక్కున్న అతడు.. ఇప్పుడు అదే ఆలయాల ముందు సొంత కారులో వెళ్తున్నాడు. వేసుకోవడానికి బట్టలు కూడా లేని స్థితి నుంచి.. ఇప్పుడు ప్రతి గంటకు ఒక డ్రెస్ మార్చేస్తున్నాడు. పెద్దపెద్ద రాజకీయ నాయకులు అతడి కోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగిపోయాడు.
ఆరాధ్య జీవితంలో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. పూటకు గతి లేని స్థితి నుంచి పూటకు ఏం తినాలో అనే స్థాయికి అతడు ఎదిగాడు. ఇంతటి అతడి వ్యాపార ప్రస్థానంలో అతడు కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. ఆత్మస్థైర్యం మీద మాత్రమే నమ్మకం ఉంచాడు. తద్వారా ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు. కష్టపడితే డబ్బు వస్తుంది.. కష్టపడకుండా డబ్బు సంపాదిస్తే నిలవకుండా వెళ్ళిపోతుంది అని నిరూపించాడు. ఈ మాట చదువుతుంటే నరసింహ సినిమా గుర్తుకొచ్చినప్పటికీ.. ఈ సినిమాను నిజ జీవితంలో నిరూపించినవాడు ఆరాధ్య.