Pawan Kalyan speech at Murugan Manadu : మధురై మురుగన్ మహానాడు జరిగి 5 రోజులు అవుతోంది. ఇంకా ఆ వేడి రగులుతూనే ఉంది. తమిళనాడులో చర్చ జరుగుతూనే ఉంది. డీఎంకే, కమ్యూనిస్టులు, నాస్తికులు, పెరియార్ ప్రేమికుల కలవరపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది వారంతా విస్మరించేవారు. కానీ 5 రోజులుగా వారు బీజేపీపై, ఈ మురుగన్ సభపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ప్రభుత్వం సహకారం లేకుండా పార్కింగ్ నుంచి సభ నిర్వహణ వరకూ వారే అన్ని ఏర్పాట్లను చక్కగా చేశారు. మురుగన్ సభలో మాట్లాడిన హిందూయిజం మాటలను ద్రవిడ వాదులు తట్టుకోలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
ఒక వీడియోను వాళ్లు ప్రదర్శించారు. హిందూయిజం దెబ్బతినడానికి రామస్వామి నాయగర్, అన్నాదురై, కరుణానిధి ఎలా కుట్రలు చేశారో వీడియోతో ప్రదర్శించారు. ఈ ముగ్గురి వీడియో బయటకు రావడంతో వారు జీర్ణించుకోవడం లేదు.
అంతకంటే ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ రాక బాగా ఇంపార్ట్ క్రియేట్ చేసింది. ఆయన తమిళంలో ప్రసంగించి ద్రవిడ వాదులకు షాకిస్తూ మురుగన్ దేవుడిని ఓన్ చేసుకున్నాడు. ద్రవిడ వాదుల నోల్లు మూయించాడు. కుహాన శక్తుల వాదం తమిళనాడులో ఎంత ప్రమాదమో పవన్ వివరించాడు.
మదురై మురుగన్ మహానాడు వేడి ఇంకా రగులుతూనే ఉంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చ.