NYC mayor candidate Zohran Mamdani : జోహ్రాన్ మంమ్దానీ న్యూయార్క్ మేయర్ అభ్యర్థి రేసులో డెమొక్రటిక్ అభ్యర్థిగా ఖరారు అయ్యాడు. ఈరోజు వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఏకంగా ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ న్యూయార్క్ సిటీ అని చెప్పి ఎడిటోరియల్ కాలమ్స్ లో జోహ్రాన్ గురించి రాశాడు.
ఇతను 33 ఏళ్ల కుర్రాడు. అమెరికన్ సిటిజన్ అయ్యింది కేవలం 8 ఏళ్ల క్రితమే. ముస్లిం వ్యక్తి. డెమొక్రటిక్ పార్టీలో డెమొక్రటిక్ సోషలిస్టులు ఈ స్థాయిలో పైకి రావడం ఇదే మొదటిసారి. భారత్ లో చాలా పార్టీలు వెన్నెముక లేని హామీలు చేస్తారో అలానే జోహ్రాన్ చేశాడు. ప్రజల ఆమోదంతో మేయర్ అభ్యర్థిగా నామినేట్ అయ్యాడు.
న్యూయార్క్ లో ప్రజాజీవితం అతలాకుతలమైంది. ప్రజల జీవన భారం పెరిగింది. ప్రజలంతా ఫస్ట్రేషన్ లో మార్పు కోరుకుంటూ ఇతడికి ఓటు వేశారు. ప్రచార శైలి అందరికంటే భిన్నంగా ఉంది. 2 లక్షల ఇల్లు కట్టిస్తానని.. రెంట్ ఫ్రీ, ఫ్రీ బస్ సౌకర్యం, చైల్డ్ కేర్ అమలు సహా ఎన్నో హామీలతో జోహ్రాన్ కు సపోర్టు చేశారు.
జోహ్రాన్ ఆధ్వర్యంలో కళాకారులు, బాలీవుడ్ ప్రచారంతో ఇంటింటికి యువకులతో ప్రచారం చేసి ప్రతీ ప్రజలను తట్టి లేపారు.
సంచలనం సృష్టించిన న్యూయార్క్ సిటీ మేయర్ డెమోక్రటిక్ అభ్యర్థి ఎన్నిక వెనుక ఏం జరిగింది.. ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.