Bigg Boss 9 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘బిగ్ బాస్ 9’ నేడు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా ఘనంగా ప్రారంభం కానుంది. కాసేపటి క్రితమే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. హౌస్ లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలు ఎవరు?, అగ్నిపరీక్ష ద్వారా అడుగుపెట్టే సామాన్యులు ఎవరు అనే దానిపై ఇప్పటికే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఒకసారి ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ ని చూస్తే సెలబ్రిటీల వైపు నుండి భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మానుయేల్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, తనూజ గౌడ, రీతూ చౌదరి, ఆశా షైనీ, సంజన గల్రాని వంటి వారు ఉన్నారు. అదే విధంగా సామాన్యుల నుండి ఆర్మీ పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి మరియు మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారు.
Also Read: ‘పుష్ప 3’ పై డైరెక్టర్ సుకుమార్ సంచలన ప్రకటన..మరి రామ్ చరణ్ మూవీ పరిస్థితి ఏంటి?
మొత్తం మీద 14 మంది హౌస్ లోపలకు అడుగుపెట్టారు. కానీ మేము కేవలం 13 మంది పేర్లు మాత్రమే చెప్పాము. మిగిలిన ఆ ఒక్కరు ఎవరు అనేదే సస్పెన్స్. ప్రోమో లో ఒక కంటెస్టెంట్ తన చేతిలో ఒక బాక్స్ పట్టుకొని నాగార్జున ముందుకొచ్చి ఇది సీక్రెట్ బాక్స్ సార్ అని అంటాడు. అప్పుడు నాగార్జున ‘ఏంటి ఆ సీక్రెట్..అందులో ఏముంది?’ అని అడగ్గా, దానికి ఆ కంటెస్టెంట్ ఇది హౌస్ లో ఉన్నప్పుడే తెలుస్తుంది సార్ అని అంటాడు. ఆ తర్వాత ఆ కంటెస్టెంట్ ‘బిగ్ బాస్ ఇది నా శరీరంలో ఒక భాగం..దయచేసి దీనిని లోపలకు తీసుకెళ్లేందుకు అనుమతిని ఇవ్వండి’ అని అడుగుతాడు. దానికి బిగ్ బాస్ ‘ఏది మీతో తెచ్చుకోవడానికి వీలు లేదు’ అని అంటాడు. అప్పుడు ఆ కంటెస్టెంట్ ‘అయితే నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను’ అని అంటాడు.
నాగార్జున కూడా నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు కానీ బిగ్ బాస్ ఇంట్లోకి మాత్రం కాదు అని అంటాడు. అప్పుడు ఆ కంటెస్టెంట్ వెనక్కి తిరిగి వెళ్లిపోయే విజువల్స్ ని చూపించారు. ఇంతకీ ఎవరు ఆ సెలబ్రిటీ కంటెస్టెంట్, గొంతు చూస్తుంటే ‘రాము రాథోడ్’ లాగా అనిపిస్తున్నాడు?, ఆయనేనా?, లేకపోతే వేరే కంటెస్టెంట్ నా?, వేరే కంటెస్టెంట్ అయితే అతను పూర్తిగా వెనక్కి వెళిపోయినట్టేనా?, మళ్లీ తిరిగి హౌస్ లోకి వస్తాడా లేదా ? ఇవన్నీ తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ ప్రోమో ని మీరు కూడా చూసేయండి. ఆ కంటెస్టెంట్ ఎవరు అయ్యుంటారో ఊహించి కామెంట్స్ ద్వారా తెలపండి.