Mahesh Rajamouli movie : మన ఇండియన్ సినిమా ని గ్రాఫిక్స్ పరంగా , టెక్నాలజీ పరంగా హాలీవుడ్ సినిమాలతో పోటీ పడేలా చేసిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది రాజమౌళి(SS Rajamouli) మాత్రమే. 10 ఏళ్ళ క్రితమే ఆ రేంజ్ స్టాండర్డ్స్ ని సెట్ చేసిన వాడు, ఇక ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు గ్రాఫిక్స్ ఆధారిత మూవీ ని ఏ రేంజ్ లో తీస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హాలీవుడ్ అవతార్ స్థాయికి ఏ మాత్రం తగ్గదు. అందుకే మహేష్(Superstar Mahesh Babu) మూవీ ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొట్టాలి, ఇదే డైరెక్టర్ రాజమౌళి ప్రధాన లక్ష్యం అన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ నేడు ఒక చిన్న అప్డేట్ ని విడుదల చేశారు.
ఈ ఏడాది నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన భారీ అప్డేట్ రివీల్ చేస్తామని, ఆ రివీల్ ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా ఉంటుందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. దీంతో అభిమానులు కాస్త శాంతించారు. అయితే సోషల్ మీడియా లో టాలెంటెడ్ ఎడిటర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నారు, అసలు ఇంత టాలెంట్ పెట్టుకొని వీళ్లేందుకు ఇంకా ఇక్కడే ఉండిపోయారు?, సినిమాల్లోకి వెళ్లిపోవచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు, ఆ రేంజ్ టాలెంట్ ఉన్నోళ్లు అన్నమాట. పైగా AI వృద్ధి లోకి వచ్చిన తర్వాత దానిని ఉపయోగించి హై క్వాలిటీ స్టాండర్డ్స్ తో వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు మహేష్, రాజమౌళి మూవీ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో అంటూ ఒక అభిమాని తన సృజనాత్మకత ని ఉపయోగించి ఒక వీడియో ని విడుదల చేసాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
ఈ వీడియో క్వాలిటీ ని చూసి అసలు ఇది ఎడిట్ వీడియో నా?, లేకపోతే ఒరిజినల్ వీడియో నా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ రేంజ్ ఉంది అన్నమాట. మరి ఇది మూవీ టీం వరకు చేరితే కచ్చితంగా వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఎంత వరకు రీచ్ అవుతుంది అనేది. ఇకపోతే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్,మాధవన్ తదితరులు నటిస్తున్నారు. విలన్స్ గా ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ చేస్తున్నారు. హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. నవంబర్ నెలలోనే హీరోయిన్ కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. మూడవ షెడ్యూల్ ని సౌత్ ఆఫ్రికా లో సెప్టెంబర్ నెల నుండి మొదలు పెట్టనున్నారు.
A globe-trotting adventure awaits
Here is the #SSMB29 Fan-Made Pre- Reveal Teaser #MaheshBabu #SSRajamouli #GlobeTrotter #TeluguFilmNagar pic.twitter.com/9jfnpXzNDM— Telugu FilmNagar (@telugufilmnagar) August 9, 2025