spot_img
Homeటాప్ స్టోరీస్Kavitha Comments On Paper Leak: కేటీఆర్ మాట్లాడొద్దన్నాడు గాని.. కవిత అడిగేస్తూనే ఉంది.. పేపర్...

Kavitha Comments On Paper Leak: కేటీఆర్ మాట్లాడొద్దన్నాడు గాని.. కవిత అడిగేస్తూనే ఉంది.. పేపర్ లీక్ లు మాజీ ఐటీ మినిస్టర్ పుణ్యమేనట

Kavitha Comments On Paper Leak: కవితను పట్టించుకోవద్దు.. ఎవరెవరో పార్టీలు పెడుతూనే ఉంటారు.. పార్టీలు ఇలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి.. అలాంటివారిని లెక్కపెట్టొద్దు.. మీరు సైలెంట్ గా ఉండండి.. అనవసరంగా రెస్పాండ్ కావొద్దు.. ఇటీవల తన పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ చేసిన సూచన. కేటీఆర్ ఆ సూచన ఎవరికోసం చేశారు.. ఎవరిని ఉద్దేశించి చేశారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కేటీఆర్ మాటకు కట్టుబడి గులాబీ పార్టీ నేతలు మాట్లాడటం లేదు. కానీ కవిత ఆగడం లేదు. టిఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకున్న తర్వాత ఆమె పొలిటికల్ గా అడుగులు వేగంగా వేస్తున్నారు. మొహమాటం లేకుండా తన తండ్రిని ఇటీవల కాలంలో మర మనిషి.. మారిన మనిషి అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, గులాబీ పార్టీలో ఉన్న కీలక నాయకులను ఉద్దేశించి పందికొక్కులు అని విమర్శించారు. ఇంతటితోనే కవిత ఆగడం లేదు.

శనివారం కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసారి మరింత లోతైన విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా కేటీఆర్ ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు జరిగిన పేపర్ల అవకతవకల గురించి కవిత మొహమాటం లేకుండా మాట్లాడేశారు.. కేటీఆర్ నిర్వాకం వల్ల రెండు తరాలు నష్టపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందుండి కొట్లాడారని.. అటువంటి వాళ్లకు న్యాయం చేయలేకపోయామని.. కనీసం ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయామని.. దేశ దేశాలు జరిగిన ఐటీ మినిస్టర్ పేపర్ లీక్ అయితే ఏం చేశారని ప్రశ్నించారు. కేటీఆర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించడంతో కవిత తన ఉద్దేశాన్ని బయటపెట్టారు. కవిత మాట్లాడిన మాటలకు గులాబీ పార్టీ నేతలు రకరకాల వక్రీకరణలు చేసినప్పటికీ.. అంతిమంగా మాత్రం గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులను కవిత బయట పెడుతూనే ఉన్నారు. ఒకరకంగా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తో కాకుండా.. భారత రాష్ట్ర సమితి తోనే విపరీతంగా నష్టం జరిగిందని కవిత పరోక్షంగా చెబుతున్నారు.

కవిత ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో గులాబీ పార్టీ కౌంటర్ ఇస్తుందా.. ఎప్పటి మాదిరిగానే సైలెంట్ అవుతుందా.. చూడాలి. కవిత పార్టీ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మీద కంటే కేసీఆర్ మీద.. గులాబీ పార్టీ నేతల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు కూడా అర్ధ రహితంగా కాకుండా.. అసలు విషయాలను బయటపెడుతున్నాయి. కవిత ఇలానే మాట్లాడుకుంటూ పోతే 2028 నాటికి గులాబీ పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి దీనిని గులాబీ బాస్ ఏ విధంగా తిప్పి కొడతారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version