colonial-mentality : భారతదేశం వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, తత్వచింతనలతో ప్రపంచ నాగరికతకు మార్గదర్శిగా నిలిచిన దేశం. అయినప్పటికీ, వలసపాలన ముగిసిన దశాబ్దాల తర్వాత కూడా మన ఆలోచనల్లో, ఆచరణలో వలసవాద ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది కేవలం రాజకీయ స్వాతంత్ర్యంతో తొలగిపోయే విషయం కాదు. మానసిక స్వాతంత్ర్యం సాధించినప్పుడే వలసవాద ఆలోచనాధోరణి నుంచి నిజంగా బయటపడగలుగుతాం.
వలసవాదం అనేది కేవలం విదేశీ పాలన మాత్రమే కాదు. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు తక్కువవని భావించడం; పాశ్చాత్య ఆలోచనలు, జీవనశైలే శ్రేష్ఠమని నమ్మడం; మన జ్ఞానవ్యవస్థలను తక్కువచేసి చూడడం — ఇవన్నీ వలసవాద ఆలోచనలే. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
ముందుగా మన చరిత్రను మనమే తెలుసుకోవాలి. గణితం, ఖగోళశాస్త్రం, వైద్యం, తత్వశాస్త్రం, కళలు, సాహిత్యం ప్రతి రంగంలో భారతీయులు ప్రపంచానికి చేసిన సేవలు అపారమైనవి. ఈ చరిత్రను కేవలం పరీక్షల కోసం కాకుండా, మన గుర్తింపుగా అర్థం చేసుకోవాలి. చరిత్రపై గర్వం ఉండాలి, కానీ అహంకారం కాదు.
వేలాది సంవత్సరాలు నడుస్తున్న నాగరికత మనది అందుకు గర్వపడుదాం దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
