Harish Rao Vs Kavitha: రాజకీయ నాయకులు విమర్శలను అంత తేలిగ్గా తీసుకోరు. అన్నిటికంటే సొంత పక్షంలో ఉన్న నాయకులు విమర్శలు చేస్తే మరింత సీరియస్గా తీసుకుంటారు. ఇటీవల జాగృతి వ్యవస్థాపకురాలు తన ఇంట్లో కుటుంబ సభ్యుడు.. హరీష్ రావు మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వాస్తవానికి ఈ ఆరోపణలు గనుక మరొక నాయకుడు చేసి ఉంటే పరిస్థితి ఇంకో విధంగా ఉండేది. గులాబీ పార్టీ దండు మాదిరిగా మీదపడేది. కానీ సొంత పార్టీ నాయకురాలు.. అందులోనూ కారు పార్టీ అధినేత కుమార్తె కావడంతో.. గులాబీ కార్యకర్తలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే హరీష్ రావు మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఆయన ఏం మాట్లాడుతారనే చర్చ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో లండన్ నుంచి వచ్చిన ఆయన.. శనివారం ఉదయం శంషాబాద్ లోనే క్లారిటీ ఇచ్చారు.
నా జీవితం తెరిచిన పుస్తకం
కవిత ఎన్నో ఆరోపణలు చేసినప్పటికీ హరీష్ రావు మాత్రం నిదానంగా మాట్లాడారు. ఏమాత్రం ఆవేశపడకుండా.. ప్రతి అంశాన్ని కూడా విడమర్చి చెప్పారు. తాను ఎటువంటి తప్పులు చేయలేదని.. తప్పులు చేయాల్సిన అవసరం కూడా లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని.. అందరికీ తెలుసు అని హరీష్ రావు పేర్కొన్నారు. లేనిపోని ఆరోపణలు చేసినంత మాత్రాన అవి నిజం కావని.. ప్రజలకు మొత్తం తెలుసని సిద్దిపేట శాసనసభ్యుడు స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు గులాబీ మీడియా విపరీతమైన ప్రాధాన్యమించింది. సోషల్ మీడియాలో కూడా గులాబీ శ్రేణులు సిద్దిపేట శాసనసభ్యుడు చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రస్తావించారు. కవితను విమర్శించుకుంటూ.. నీటిపారుదల శాఖ మాజీ మంత్రి పి చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వారు రకరకాల వీడియోలు రూపొందిస్తున్నారు.
కవిత ఏం మాట్లాడుతారు
సిద్దిపేట శాసనసభ్యుడు స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన నేపథ్యంలో జాగృతి అధినాయకురాలు తర్వాత ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కొంతమంది జాగృతి నాయకులు కొంతమంది నిరసన స్వరం వినిపించిన నేపథ్యంలో కవిత ఇతర నాయకులతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులు ఆమెతో టచ్ లో ఉన్నారని.. కొద్దిరోజుల్లో కార్యాచరణను కవిత ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఆమె కొత్త రాజకీయ పార్టీ ద్వారా ప్రయాణం సాగిస్తారా.. లేక జాగృతి ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు మొదలు పెడతారా.. అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ హరీష్ రావు ఎటువంటి పరుష వ్యాఖ్యలు చేయకుండానే.. హుందాగా సమాధానం చెప్పారు.
లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు.
కవిత వ్యాఖ్యలపై హరీష్ రావు రియాక్షన్. నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాల్సిన బాధ్యత నాపై ఉంది. నాపై చేసిన… pic.twitter.com/gc4wVks5jF
— Telugu Stride (@TeluguStride) September 6, 2025