Hari Hara Veera Mallu Public Talk : ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ట్విట్టర్ మోత మోగిపోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా హరిహర వీరమల్లు గురించే చర్చ.. ఇక శరామామూలుగానే యూట్యూబర్స్, మైక్ లు పట్టుకొని థియేటర్స్ ముందు నిలబడే ఇంటర్వ్యూయర్స్ తో రచ్చ రచ్చ జరుగుతోంది.
దర్శకుడు క్రిష్ మంచి కథ , కథనంతో ఈ సినిమా మొదలుపెట్టాడు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం ఈ సినిమా కథను ఎటూ కాకుండా చేసింది. క్రిష్ కు కనుక నాడే పవన్ టైం ఇచ్చి ఉంటే ఇది నాలుగేళ్ల క్రితమే పూర్తయ్యేది విడుదలయ్యేది. కానీ లేటుగా లేటెస్టుగా దర్శకుడు మారి.. కథను రాసిన వ్యక్తి కాకుండా వేరే డైరెక్టర్ చేతుల్లోకి వెళ్లి చాలా చాలా మారిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యింది.
బెనిఫిట్ షోలు, యూఎస్ఏ షోలు బయటకొస్తున్నాయి. ఇవన్నీ ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి అందరూ ఒర్రి చంపుతున్నారు. మా పవన్ అంటూ బట్టలు చింపుకుంటున్నారు. వీరి రివ్యూను, టాక్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలైన టాక్ అన్నది అఫీషియల్ గా రిలీజ్ అయ్యాక సగటు ప్రేక్షకుడు చూశాక.. రివ్యూయర్లు చూసి రాశాక బయటపడుతుంది.
ప్రస్తుతానికైతే కొంచెం పాజిటివ్ వైబ్ గానే కనిపిస్తోంది. టికెట్స్ భారీగా కొనడం.. కొంచెం చారిత్రక పాత్ర.. పవన్ బాగా నటించాడని.. కథ జెన్యూన్ చరిత్ర కావడం.. ఎప్పుడూ చూడని కథ కావడంతో కొంచెం ఆసక్తి రేపుతోంది. ఇక పవన్ సినిమాల్లో నటించక చాలా సంవత్సరాలైంది. జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. సో ప్రీమియర్స్ కు వారే వెళతారు కాబట్టి కొంచెం ఆదాయం కూడా బాగానే బయ్యర్లకు వస్తోంది. దాదాపు జిల్లాకు సగటున 80 లక్షలు కలెక్షన్ అయినట్టు సమాచారం.
ప్రస్తుతం ఏపీలో హరిహరవీరమల్లను 60 కోట్లకు అమ్మినట్లు సమాచారం. సినిమా మీద పెద్ద అంచనాలు లేవు.. పవన్ మనసు పెట్టి చేయకపోవడంతో ఆయనకే కాదు అందరికీ డౌట్ కొడుతోంది. పైగా స్టాట్ చేసిన డైరెక్టర్ క్రిష్ వదిలేశాడు.
ప్రస్తుతం జనాలు హిట్ అంటేనే థియేటర్స్ కు వస్తున్నారు. యూఏస్ఏలో కొంచెం పాజిటివ్ టాక్ నే వస్తోంది. మరి అంత హిట్ అన్న టాక్ కూడా వినిపించడం లేదు. సినిమా ఫర్వాలేదు అనే స్థాయిలో మాత్రం వినిపిస్తున్నట్టు సమాచారం.