Dil Raju Yellamma Movie : ఈ ఏడాది ప్రారంభం లో ‘గేమ్ చేంజర్’ చిత్రం తో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్న నిర్మాత దిల్ రాజు(Dil Raju), కేవలం నాలుగు రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తో భారీ కమర్షియల్ హిట్ అని అందుకొని, భారీ నష్టాల నుండి తప్పించుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సేఫ్ అయ్యాడు కదా అని అందరూ అనుకుంటే రీసెంట్ గానే తమ్ముడు చిత్రం తో మరో భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా కోసం ఆయన 70 కోట్లకు పైగా బడ్జెట్ ని ఖర్చు చేసాడట. నాన్ థియేట్రికల్ రైట్స్ నుండి కొంతవరకు రీ కవర్ అయ్యింది కానీ, థియేటర్స్ నుండి మాత్రం పది శాతం రీకవరీ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది. వరుస ఫ్లాప్స్ లో బాగా డౌన్ అయిపోయిన నితిన్ ని దిల్ రాజు ఈ చిత్రంతో పాతాళంలోకి తొక్కేసాడు.
ఇదంతా పక్కన పెడితే దిల్ రాజు ఇదే నితిన్(Nithin) తో ఇప్పుడు ‘ఎల్లమ్మ'(Yellamma Movie) అనే ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు బలగం వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైంది. షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టడమే బ్యాలన్స్ ఉంది. అయితే ఇప్పుడు తమ్ముడు ఫ్లాప్ తో ‘ఎల్లమ్మ’ చిత్రం ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనే దానిపై మరోసారి స్క్రిప్ట్ ని విశ్లేషిస్తున్నాడట నిర్మాత దిల్ రాజు. అయితే తమ్ముడు మూవీ ప్రొమోషన్స్ సమయంలో దిల్ రాజు ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముందు గా ఈ స్క్రిప్ట్ నేచురల్ స్టార్ నాని వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాని ఈ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేసాడు అనేది దిల్ రాజు ఈ ఇంటర్వ్యూ లో వివరించాడు.
ఆయన మాట్లాడుతూ ‘ముందు నాని(Natural Star Nani) ని అనుకున్నాము. కానీ ఆయనకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా చేయలేనని చెప్పాడు. ఇప్పుడు ప్యారడైజ్ చేస్తున్నాడు కదా. ఈ సినిమా అయ్యాక చేస్తానని అన్నాడు, అంత వరకు ఆగలేక నితిన్ తో చేస్తున్నాం. ఎల్లమ్మ అనే టైటిల్ ఉండగానే అందరూ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అనుకోని హీరోలు చేయడానికి కాస్త తడబడతారు కదా, నేను వేణు కి చెప్పాను, ఈ ప్రాజెక్ట్ ని హీరోలు ఒప్పుకోవడం అంత తేలికైన విషయం కాదు, కానీ నువ్వు టైటిల్ మార్చడానికి వీలు లేదు,నువ్వు చెప్పిన కథకు ఎల్లమ్మ టైటిల్ నే లాక్. మనం అనుకున్న కథనే తియ్యాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ‘తమ్ముడు’ స్క్రిప్ట్ కూడా ముందుగా నాని చేయాల్సింది అట, కానీ ఆయనకు స్క్రిప్ట్ నచ్చకపోవడం తో రిజెక్ట్ చేశాడు.