Homeవార్త విశ్లేషణViral Dancer Video: ఏం తిప్పావురా... నువ్వు గొప్ప కళాకారుడివీ సామీ

Viral Dancer Video: ఏం తిప్పావురా… నువ్వు గొప్ప కళాకారుడివీ సామీ

Viral Dancer Video: అప్పట్లో ప్రేమికుడు అనే ఒక సినిమా వచ్చింది. అందులో ముక్కాబులా అనే పాట ఓ సెన్సేషన్. ఆ పాటలో ప్రభుదేవా అద్భుతమైన స్టెప్పులు వేశాడు. ముఖ్యంగా ఆ పాటలో కాళ్లను అద్భుతంగా మెలి తిప్పాడు. చేతులను లాఘవంగా అటూ ఇటూ అన్నాడు. ఇక తలనైతే 360 డిగ్రీలు తిప్పేశాడు.. దీనిని బట్టి అతడి డ్యాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుదేవా ఆ పాటతో ఒక్కసారిగా జాతీయస్థాయి కొరియోగ్రాఫర్ గా మారిపోయాడు. ఇండియన్ మైకల్ జాక్సన్ గా అవతరించాడు.

ఈ వీడియో కనిపిస్తున్న ఆ వ్యక్తి కూడా ప్రభుదేవాను మించి చేశాడు. 360 డిగ్రీల చుట్టూ తన నేత్రాలను తిప్పాడు. శరీరంలో ఉన్న అన్ని భాగాలను అదే విధంగా తిప్పి ఆశ్చర్య పరిచాడు. సాధారణంగా పేరుపొందిన జిమ్నాస్టులు ఇలా చేస్తుంటారు. కానీ అతడు జిమ్నాస్ట్ కాదు. అతడికి మొదటి నుంచి కూడా సహజ సిద్ధంగా శరీరాన్ని తిప్పడం అలవాటు. దానిని క్రమక్రమంగా ప్రాక్టీస్ చేస్తూ ఇంతలా ఎదిగాడు..

అతడు శరీరాన్ని తిప్పుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నేత్రాలను అటు ఇటు కదిలిస్తున్న తీరు వామ్మో అనిపించేలా చేస్తోంది. తల భాగం నుంచి మొదలు పెడితే చేతుల వరకు అతడు తిప్పుతూనే ఉన్నాడు. లయబద్ధంగా కదుపుతూనే ఉన్నాడు.. ఇతడు గనక విదేశాలలో ఉండి ఉంటే అద్భుతమైన అవకాశాలను సొంతం చేసుకునే వాడని నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఈ స్థాయిలో ప్రతిభ ఉన్న ఈ వ్యక్తికి కచ్చితంగా అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

“అమెరికాలో పేరుపొందిన రియాల్టీ షోలలో ఇటువంటి కళాకారులు కనిపిస్తుంటారు. వారు తమ ప్రతిభను బయటపెడుతుంటారు. అలా వారికి అవకాశాలు వస్తూ ఉంటాయి. కళాకారులను గౌరవించినప్పుడే సమాజానికి బాగుంటుంది. ఎందుకంటే కళ బయటపడినప్పుడే సమాజం బాగుపడుతుంది. ఇంకా అనేక మంది కళాకారులు బయటికి వస్తారు. వారు తమ ప్రతిభను బయటపెడతారు.. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి కళాకారుడి ప్రదర్శన చూడడం నిజంగా ఆనందాన్ని కలిగిస్తోందని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version