Ukrainian real hero : రష్యా రెండు నెలలుగా సాగిస్తున్న యుద్ధకాండను ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది. దేశం మొత్తం విధ్వంసం జరుగుతున్నా.. అమెరికా, బ్రిటన్‌తోపాటు ప్రపంచంలోకి కొన్ని దేశాల సహకారంతో రష్యా సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ సైన్యం తమకు అందుతున్న ఆధునిక ఆయుధాలతో రష్యాపై ఎదురు దాడి చేస్తున్నారు. తమ భూభాగాలను ప్రధాన నగరాలను ఆక్రమించుకోకుండా తిప్పి కొడుతున్నారు. దీనిని జీర్ణించుకోలేకపోతున్న రష్యా.. అక్యడి ప్రజలపై అకృత్యాలకు తెగబడుతోంది. మహిళలపై హత్యాచారాలు చేస్తోంది. చిన్న పిల్లలలను, మూగ జీవాలను కూడా వదలడం లేదు. ఇన్ని సమాళ్ల నడుమ ఓ ఉక్రెయిన్ సైనికుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ సంపత్తి కలిగిన దేశాలల్లో ఒకటైన రష్యాకు ఎదురొడ్డి పోరాడుతున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకగా 40 రష్యా యుద్ధ విమానాలను నేలమట్టం చేసి రియల్ హీరో అయ్యాడు.
-గోస్ట్ ఆఫ్ కీవ్..
ఉక్రెయిన్–రష్యా యుద్ధ భూమిలో ఆ సైనికుడు ‘గోస్ట్ ఆఫ్ కీవ్’గా పేరు తెచ్చుకున్నాడు. ఈ యుద్ధం ఎప్పటికైనా ముగియక తప్పదు. చరిత్రలో కలిసిపోకా తప్పదు. కానీ ఈ గోస్ట్ ఆఫ్ కీవ్ గా గుర్తింపు పొందిన ఉక్రెయిన్ ఫైటర్ మాత్రం భూమి ఉన్నంత వరకు గుర్తుండి పోతాడు. ఉక్రెయిన్ తనకు అప్పగించిన బాధ్యతలకు అక్షరాలా న్యాయం చేసిన ఈ బ్రేవ్ సోల్జర్ ఇటీవలే నేలకొరిగాడు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. అతడి సేవలను ప్రపంచానికి తెలియజేసి అతడికి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది.
-ఉక్రెయిన్ వార్ హీరో..
యుద్ధ భూమిలో నేలకొరిగిన ‘గోస్ట్ ఆఫ్ కీవ్’.. రష్యాకు చెందిన అత్యాధునిక 40 ఫైటర్ జెట్లను నేల కూల్చాడు. ఆ మేజర్ యుద్ధ భూమిలోకి దిగితే ప్రత్యర్థులు ప్రాణాలపై ఆశలు వదులు కోవాల్సిందే అన్నట్లుగా సాగింది ఆయన ప్రయాణం. యుద్ధ విమానంతో నింగిలోకి ఎగిరాడంటే ప్రత్యర్థుల వ్యూహాలను పసిగడుతూ శత్రు మూకల కన్నుగప్పి ఊహకందకుండా వారిపై దాడి చేసి నాశనం చేస్తాడు. ఆయన కదన రంగంలో కాలు మోపితే వైమానిక దళానికి ఊపిరి అందినట్లే. రష్యా వాయుసేన వెన్నులో వణుకు పుట్టించిన అరివీర భయంకురుడు అతను. తన తుది స్వాస వరకూ దేశం కోసం పోరాడిన గోస్ట్ ఆఫ్ కీవ్ గురించి ఉక్రెయిన్ ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచింది. అయితే ఇటీవలే ఆ వార్ హీరో కదన రంగంలో చనిపోవడంతో అతడి గురించి ఇటీవలే బహిరంగంగా ప్రకటించింది.
-కీవ్‌లో అడుగు పెట్టకపోవడానికి అతనే కారణం..
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించింది. కానీ నేటికీ ఉక్రెయిన్ గగనతలంపై పట్టు సాధించలేకపోయింది. గగనతలంపై పట్టు సాధించి ఉంటే ఇప్పటికే రష్యా వార్ ముగిసేది. పుతిన్ చేతిలో కీలుబొమ్మ ప్రభుత్వం ఉక్రెయిన్‌లో ఏర్పడేది. ఈ అంతటికీ కారణం ఒకే ఒక్క ఉక్రెయిన్ వాయసేన మేజర్ ‘స్టెపాంగ్ థారాబల్కా’. ఈ పేరును రష్యన్ సేనలు ఇప్పట్లో మర్చిపోవంటే అతిశయోక్తి కాదు. రష్యా వాయు సేనలకు చుక్కలు చూపించాడు ఈ ఉక్రెయిన్ మేజర్. రష్యా సైన్యానికి ఓ పీడ కలలా మారాడు. స్టెపాంగ్ దూకుడుతోనే 40 రష్యా జెట్ ఫైటర్లు నేలమట్టమయ్యాయి. ఆయన బలంతోనే ఉక్రెయిన్ సైన్యం రష్యాకు తమ గగనతలంపై పట్టు చిక్కకుండా కాపాడుకోగలిగింది. యుద్ధం మొదలైన తొలి రోజే ఆరు రష్యా జెట్ ఫైటర్లను స్టెపాంగ్ కుప్ప కూల్చాడు. దీనిని గమనించిన రష్యా ఆరోజు నుంచి అతడిని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తోంది.
-శత్రువులకు చిక్కకుండా జాగ్రత్తపడిన ఉక్రెయిన్..
స్టెపాంగ్ కోసం రష్యా బలగాలు గాలిస్తున్న విషయాన్ని అతడిని టార్గెట్ చేసిన రహస్యాన్ని పసిగట్టిన ఉక్రెయిన్ తమ మేజర్ వివరాలు రష్యాకు తెలియకుండా గోప్యంగా ఉంచుతూ వచ్చింది. దీంతో కళ్లముందే కనిపిస్తూ రష్యా విమానాలను కూలుస్తున్నా రష్యా బలగాలు ఏమీ చేయలేకపోయాయి. స్టెపాంగ్ ధైర్య సాహసాలను గుర్తించిన ఉక్రెయిన్ మాత్రం అతడిని ‘గాడియల్ ఏంజిల్’ అనే బిరుదుతో కీర్తించింది. అక్కడి పౌరులు గోస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలుచుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని రష్యాకు చిక్కకుండా కాపాడడంలో ఆయన పాత్ర అమోఘమని వివరించింది అక్కడి ప్రభుత్వం. ఈ స్థాయిలో ప్రదర్శన, ధైర్యం కనబర్చిన ఉక్రెయిన్ బలగాల్లో కొంతమందే ఉన్నారు. అత్యంత ఆధునిక ఆయుధాలు ఉన్న రష్యా సైన్యానికి ఎదురొడ్డి నిలవడంతోపాటు ప్రత్యర్థులకు చెందిన 40 ఫైటర్ జెట్ లను కూల్చడం సామాన్య విషయం కాదు. మేజర్ స్టెపాంగ్ బల్కా దీనిని నిజం చేశాడు. శత్రువులను తప్పించుకుంటూ దెబ్బ కొట్టడంలో ఆయన ఆరితేరాడు. ఈ సైనికుడి ప్రతిభ మాస్కోకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. అరివీర భయంకరుడైన స్టెపాంగ్ మార్చి 13న నేలకొరిగాడు. ఆకాశంలో శత్రు విమానాలు స్టెపాంగ్ ఆపరేట్ చేస్తున్న మిగ్ 29 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
-అరుదైన గౌరవం..
మరోవైపు మేజర్ తారాబల్కన్ సేవలను గుర్తించిన ఉక్రెయిన్ ప్రభుత్వం యుద్ధరంగంలో టాప్ మెడల్ ‘ఆర్డర్ ఆఫ్‌ది గోల్డెన్ స్టార్’ను మరణానంతరం ప్రకటించింది. స్టెపాంగ్కు భార్య ఉలేనియా, ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి పైలెట్ కావాలని కలలుగన్న మేజర్ తన కలను నిజం చేసుకోవడమే కాకుండా రష్యా సైన్యానికి చుక్కలు చూపించి మాతృ భూమి కోసం వీరోచిత పోరాటం చేసి నేలకొరిగాడు మేజర్ స్టెపాంగ్. ఆయన పేరు గోస్ట్ ఆఫ్ కీవ్‌గా ప్రాచుర్యంలోకి వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీ అయ్యాడు. యుద్ధంలో ఆయన ఉపయోగించిన హెల్మెట్, గాగుల్స్‌ను లండన్‌లో వేలం వేయబోతున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఇవి చరిత్రలో ‘గోస్ట్ ఆఫ్ కీవ్’కు సాక్షంగా నిలిచిపోనున్నాయి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: The story of the only ukrainian real hero who shot down 40 russian warplanes
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com