Revanth Reddy vs Allu Arjun : 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాడు. ఆయన సీఎం అయ్యాక, తెలుగు సినిమాకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న ఏపీలో నిర్మాతలకు కష్టాలు మొదలయ్యాయి. టికెట్స్ ధరలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ చేశారు. సీఎంగా ఎన్నికైన తనను టాలీవుడ్ ప్రముఖులు కలిసి, అభినందనలు తెలపకపోవడం తో వైఎస్ జగన్ ఆ నిర్ణయం తీసుకున్నాడంటూ కథనాలు వెలువడ్డాయి. టికెట్స్ ధరలు కేంద్రంగా పెద్ద వివాదమే నడిచింది. పవన్ కళ్యాణ్, నాని తో పాటు కొందరు హీరోలు నేరుగానే సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. సినీ పెద్దలు ఒక మెట్టు దిగి.. చిరంజీవి నేతృత్వంలో వైఎస్ జగన్ ని కలిశారు. కొంత మేర టికెట్స్ ధరలు పెంచుతూ కొత్త జీవో విడుదల చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. బడా చిత్రాలకు టికెట్స్ ధరలు పెంపు, బెనిఫిట్ షోలకు కూడా గత ప్రభుత్వంలో అనుమతి ఉండేది కాదు. కనీసం కొంత భాగం షూటింగ్ ఏపీలో జరిపిన సినిమాలకే టికెట్స్ ధరల పెంపుకు అనుమతి, అని కూడా జీవోలో పొందుపరిచారు.
దీంతో ఏపీలో అధికార మార్పు జరగాలని ఇండస్ట్రీ గట్టిగా కోరుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎన్డీయే కూటమి ఏపీలో అధికారం చేపట్టింది. దాంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. ఏపీలో తమకు లైన్ క్లియర్ అయ్యిందని అనుకుంటే… తెలంగాణలో సమస్యలు మొదలయ్యాయి. టాలీవుడ్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ ని డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలంటూ… టాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. డ్రగ్ కల్చర్ తో హైదరాబాద్ పరువు తీస్తే ఊరుకునేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
టికెట్ ధరలు పెంచాలని కోరే దర్శక నిర్మాతలు, హీరోలు డ్రగ్స్ కి వ్యతిరేకంగా క్యాంపైన్ చేయాలని కండిషన్ పెట్టాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కి పరిశ్రమ అత్యంత అనుకూలం అని నమ్ముతున్న సీఎం రేవంత్ రెడ్డి, అవకాశం దొరికితే.. తొక్కి పట్టి నార తీస్తున్నాడు. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చేశారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ వెనక సీఎం రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపించాయి. అరెస్ట్ అనంతరం విడుదలైన అల్లు అర్జున్ ని చిత్ర ప్రముఖులు కలిసి సంఘీభావం తెలపడాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వ్యతిరేకించాడు.
అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దల పై ఫైర్ అయ్యాడు. పుష్ప 2 ప్రీమియర్ షోకి హాజరైన ఒక మహిళ తొక్కిసలాటలో కన్నుమూసింది. ఈ కారణంగా ఇకపై తెలంగాణలో టికెట్స్ ధరల పెంపుకు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఉండవు అన్నారు. ఇది అతి పెద్ద కుదుపు అనడంలో సందేహం లేదు. భారీ బడ్జెట్ చిత్రాలు ఓపెనింగ్స్ పరంగా నష్టపోతాయి. సీఎం రేవంత్ రెడ్డిలోని ఫైర్ చేస్తుంటే.. రానున్న కాలంలో టాలీవుడ్ కి మరిన్ని కష్టాలు తప్పవు అనిపిస్తుంది. తెలంగాణలోనే బడా హీరోలు, దర్శకులు, నిర్మాతలు, నటుల ఆస్థిపాస్తులు ఉంటాయి. ఎవరు తోక జాడించినా.. లూప్ హోల్స్ వెతికి, గట్టి షాక్ ఇవ్వడం ఖాయం.