Hyderabad Real Estate: హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యాని. ప్రపంచంలోని బెస్ట్ ఫుడ్ లో హైదరాబాద్ బిర్యానీ ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్లోనూ హైదరాబాద్ దూసుకుపోతుంది. ఇక్కడ ఎన్నో రకాల భవనాలు నిలుస్తున్నాయి. కోకాపేట, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలకు వెళ్తే ఇది అమెరికానా? అనే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా బెంగళూరు నుంచి చాలామంది ఐటీ నిపుణులు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్నారు. అయితే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం ఏంటి?
Reserve Bank of India housing sector ప్రకారం.. 2015 నుంచి 2020 వరకు Compound Annual Growth Rate (CAGR ) ప్రకారం.. టాప్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. ఈ కాలంలో ఇక్కడ అనేక నిర్మాణాలు జరిగాయి. మాసివ్ బిల్డింగ్స్.. 200 ప్లస్ ఐటి సెక్టార్స్.. ORR, Metro వంటి నిర్మాణాలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెంబర్ వన్ స్థానంలోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా దేశంలోని టాప్ ప్లేస్ రియల్ ఎస్టేట్ కంపెనీలు హైదరాబాదులో పలు నిర్మాణాలు చేపట్టాయి. వీటిలో ASBL కూడా ఒకటిగా నిలిచింది. దీని చైర్మన్ అభిజిత్ ఇక్కడ అనేక నిర్మాణాలు చేపడుతున్నారు.
హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పెరగడానికి ప్రధాన కారణం ఐటీ సెక్టార్ పెరగడమే అని నిపుణులు అంటున్నారు. బెంగళూరు కంటే హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎంతో సేఫ్ అని భావించి చాలామంది ఐటీ నిపుణులు ఇక్కడికి తరలివస్తున్నారు. విదేశాలకు చెందిన చాలామంది హైదరాబాదులో 7.3 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని ప్రధానమైన కంపెనీలు హైదరాబాదులో వెలుస్తున్నాయి. ఇక్కడున్న వాతావరణం.. మాన్ పవర్ కారణంగా కంపెనీలు హైదరాబాద్కు తరలివస్తున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎక్కువగా కనిపిస్తుంది.
అయితే ఇటీవల రాష్ట్రంలో భూముల అమ్మకాలు, కొనుగోలు తగ్గినప్పటికీ.. హైదరాబాదులో మాత్రం భారీ ఎత్తున భవనాలు నిర్మాణాలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నివాసం కోసం వీటిని నిర్మించి విక్రయిస్తున్నారు. 3bhk ప్లాట్ నుంచి ప్లాట్లను విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడ ఒకవైపు నిర్మాణాలు జరుగుతున్న ప్లాట్ ను కొనుగోలు చేసిన లాభాలు వచ్చే అవకాశం ఉందని కొందరు రియల్ ఎస్టేట్ నిపుణులు తెలుపుతున్నారు. గతంలో కంటే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు పెరిగిపోయాయని.. ఒకవైపు కంపెనీల కోసం.. మరోవైపు నివాస గృహాల సముదాయాలు ఎక్కువగా నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయి.
హైదరాబాదులోని దూర ప్రాంతాల్లో సౌకర్యాలు అనుకూలంగా ఉండడంతో విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడికి తరలివస్తున్నాయి. అంతేకాకుండా కొందరు ఎన్నారై లు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడే కొలువై ఉండడంతో చాలామంది ఉద్యోగం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.