Kaleshwaram: కాళేశ్వరం కృంగడానికి కారణం ఏంటి? తప్పు ఎవరిది?

డ్యాం క్రస్ట్ గేట్లను కేంద్ర బృందం చెక్ చేసింది. వాటి క్వాలిటీ.. క్రస్ట్ గేట్ల చుట్టుపక్కల డ్యాంకు వాడిన మెటీరియల్ ప్రామాణికతను పరిశీలించింది. మేడిగడ్డ,అన్నారం బ్యాలెన్స్ సింగ్ రిజర్వాయర్ల పూర్తి కోసం గుత్తేదారులు ఎంత టైం తీసుకున్నారన్న విషయంపైన కూడా ఆరా తీసింది.

Written By: Neelambaram, Updated On : May 23, 2024 11:30 am

Kaleshwaram

Follow us on

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల కుంగివేతలకు గల కారణాల అధ్యయనం కోసం ఎట్టకేలకు రాష్ట్రానికి కేంద్ర నిపుణుల బృందం వచ్చింది. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సిడబ్ల్యూటిఆర్ ఎస్) టీమ్ పూణే నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంది. అందులో భాగంగా మొదటగా మేడిగడ్డ,అన్నారం బ్యారేజ్ లను నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి నిపుణుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మేడిగడ్డ వద్ద కుంగిన వంతెనను నిపుణుల బృందం తరువుగా చెక్ చేసింది. గత ఏడాది సెప్టెంబర్ లో కుంగిన పిల్లర్ల వద్దకు వెళ్లి అక్కడ జరిగిన పనుల తీరును పరిశీలించింది. అలాగే అంతకుముందు డ్యామ్ సేఫ్టీ విషయంలో చేసిన పరీక్షల గురించి నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకుంది.

డ్యాం క్రస్ట్ గేట్లను కేంద్ర బృందం చెక్ చేసింది. వాటి క్వాలిటీ.. క్రస్ట్ గేట్ల చుట్టుపక్కల డ్యాంకు వాడిన మెటీరియల్ ప్రామాణికతను పరిశీలించింది. మేడిగడ్డ,అన్నారం బ్యాలెన్స్ సింగ్ రిజర్వాయర్ల పూర్తి కోసం గుత్తేదారులు ఎంత టైం తీసుకున్నారన్న విషయంపైన కూడా ఆరా తీసింది. మరోవైపు గత ఏడాది వర్షాకాలం సందర్భంగా రిజర్వాయర్ల వద్ద బుంగలు ఏర్పడడానికి గల కారణాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ఏ రకమైన నివేదికలను అప్పటి ప్రభుత్వానికి అందజేశారు అనే అంశం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని కూడా వారు రికార్డు చేశారు. ఈ నేపథ్యంలోనే రిజర్వాయర్ల వద్ద భారీ ఎత్తున ఇసుక మేటలు కూరుకపోవడంపై వారు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఇసుక దిబ్బలు ఎక్కువైతే డ్యామ్లకు మరింత ప్రమాదం చేకూరవచ్చని నీటిపారుదల అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అందువల్ల ఇసుక మేటలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డ్యాములు భవిష్యత్తులో పనికొచ్చే అవకాశం ఉందా..? లేక ప్రత్యామ్నాయ మార్గాలను ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా..? అనే అంశాన్ని కూడా కేంద్ర నిపుణుల బృందం తరువుగా పరిశీలించింది. ఇందుకోసం రిజర్వాయర్ల పరిసరాల్లో భూగర్భ పరీక్షలను నిర్వహించింది. సాయిల్ కు సంబంధించిన ఈ ల్యాండ్ ఎగ్జామినేషన్ ను కూడా చేపట్టింది. తాత్కాలికంగానైనా ఈ ప్రాజెక్టులను వాడుకోవచ్చా..? లేదా..? అనే అంశంపై కేంద్ర బృందం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. డ్యాముల వద్ద భారీగా బొగ్గు నిక్షేపాలున్నట్లు ఉన్నట్లు సెంట్రల్ టీం తేల్చింది. అయితే ఆ బొగ్గు నిక్షేపాల వల్ల కూడా రిజర్వాయర్లకు భవిష్యత్తులో ప్రమాదాలు జరగొచ్చని అంచనా వేస్తోంది. ఇక సుందిళ్ల బ్యారేజ్ ను కూడా సందర్శించిన తర్వాత కేంద్ర బృందం తన నివేదికలను అటు సెంట్రల్ గవర్నమెంట్ కు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. ఈ నివేదికలు అందిన తర్వాత మరో రెండు సంస్థల చేత డ్యాముల భద్రతపై చేయించిన పరిశీలన నివేదికలను కూడా ఎగ్జామినేషన్ చేసి ప్రభుత్వం ఓ అంచనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఎలా ఉన్నా.. తాత్కాలికంగా మాత్రం రిజర్వాయర్ల మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పూణే నుంచి వచ్చిన సెంట్రల్ టీం అనేక లోపాలను గుర్తించింది. అందువల్ల వాటిని కూడా సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.