https://oktelugu.com/

Ramakrishna Reddy Pinnelli: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిన్నెల్లి

పోలింగ్ నాడు మాచర్లలో విధ్వంసకర ఘటనలు జరిగాయి. ఆ తరువాత కూడా కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటయింది.

Written By:
  • Dharma
  • , Updated On : May 23, 2024 / 11:25 AM IST

    Ramakrishna Reddy Pinnelli

    Follow us on

    Ramakrishna Reddy Pinnelli: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఆయన ఎక్కడున్నారు? ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదు? ఆయన తప్పించుకున్నారా? లేకుంటే పోలీసులే తప్పిస్తున్నారా? ఇలా చాలా రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే మాచర్ల రావాలంటే నాకు ఎంతసేపు? రావాలంటే ఇట్టే రాగలను అంటూ పిన్నెల్లి ప్రకటనలు చేస్తున్నారు.పోకిరి సినిమాలో విలన్ మాదిరిగా గంట గంటకు లీకులు వదులుతున్నారు. అయితే ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతోంది. ఇంకెన్ని వెబ్ సిరీస్ లు విడుదలవుతాయోనని ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది.

    పోలింగ్ నాడు మాచర్లలో విధ్వంసకర ఘటనలు జరిగాయి. ఆ తరువాత కూడా కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటయింది. దర్యాప్తులో భాగంగా వారు పోలింగ్ కేంద్రాల్లో సీసీ పూటేజీలను పరిశీలించగా.. ఓ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జరిపిన విధ్వంసం వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచే డైలాగులు మీద డైలాగులు విసురుతున్నారు. ‘నేను నేరుగా చెబుతున్నాను. నాకు మాచర్ల రావాలంటే రెండు గంటల సమయం చాలు అన్నవాడు రెండు కార్లు ఎందుకు మారాడు’ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘పులిరా పులిరా పెద్ద పులి రా.. ఈవీఎంలు పగలగొట్టిన పారిపోయరా’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘జూన్ 4 వరకు టైం పాస్ ఎలా అవుతుంది అనుకున్నాం.. నీ తస్సాదియా ఏం కథలు మొదలుపెట్టిండ్రు పో’ అంటూ పిన్నెల్లి ఎపిసోడ్ పై జోకులు వేసుకుంటున్నారు.

    సోషల్ మీడియాలో అయితే పిన్నెల్లి టార్గెట్ గా చాలా రకాల పోస్టులు దర్శనమిస్తున్నాయి. మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి మంచివాడు అని సీఎం జగన్ చెబితే ఏమో అనుకున్నాం.. ఈవీఎంలను ధ్వంసం చేసేటంత మంచివాడు అంటూ నెటిజెన్లు వ్యాఖ్యానిస్తున్నారు.అంతటితో ఆగకుండా బాత్రూములకు కొమోడ్లు తయారుచేసి కంపెనీలో దాక్కుంటావా బుజ్జి అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఏలేవాడు మనవాడైతే ఎన్ని వేషాలైనా వేయవచ్చని ఇంకొందరు, ఇప్పుడే ఇలా ఉంటే ఫలితాలు వచ్చాక ఎన్ని వెబ్ సిరీస్ విడుదలవుతాయో అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పిన్నెల్లి వ్యవహారమే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.