spot_img
HomeతెలంగాణRevanth Reddy New Look: రేవంత్ రెడ్డి ఏంటి.. ఇలా మారిపోయాడు.. లుక్ వైరల్

Revanth Reddy New Look: రేవంత్ రెడ్డి ఏంటి.. ఇలా మారిపోయాడు.. లుక్ వైరల్

Revanth Reddy New Look: తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి స్విట్జర్లాండ్‌లో నిర్వహిస్తున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు వెళ్లారు. ఏపీ సీఎం సోమవారం వెళ్లగా, తెలంగాణ సీఎం మంగళవారం దావోస్‌ వెళ్లారు. ఏపీ సీఎంకు సింగపూర్‌ ప్రధాని ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టుకు వచ్చి మరీ స్వాగతం పలికారు. ఇక తెలంగాణ సీఎం స్టైలిష్‌ లుక్‌తో స్విట్జర్లాండ్‌లో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. కార్యక్రమాలకు తగినట్లుగా వస్త్రధారణ చేసే రేవంత్‌రెడ్డి ఆలయాలకు వెళ్లినప్పుడు సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. క్రీడాల్లో స్పోర్ట్స్‌ డ్రెస్‌లో ఎంట్రీ ఇస్తారు. ఇక ఫారిన్‌ వెళ్లినప్పుడు స్టైలిష్‌ లుక్‌లో అదరగొడతారు. తాజాగా స్విట్జర్లాండ్‌లో చల్లని వాతావరణానికి తగినట్లుగా తగిన క్యాజువల్‌ వస్త్రధారణలో కనిపించిన ఆయన స్టైలిష్‌గా కనిపించారు. మొత్తం తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా మారారు.

ఇరువురు నేతలు కీలక సమావేశాలు..
డబ్ల్యూఈఎఫ్‌ – 2026 సదస్సు మొదటి రోజు నుంచే రేవంత్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పారిశ్రామికవేత్తలతో, అంతర్జాతీయ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లతోసమావేశం కానున్నారు. ‘’తెలంగాణ రైజింగ్‌ 2047’ గురించి వివరించి పెట్టుబడులు ఆకర్షించాలని సీఎం భావిస్తున్నారు. పెట్టుబడుల భాగస్వామ్యాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈసారి వీలైనంత ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలన్న సంకల్పంతో దావోస్‌లో అడుగు పెట్టారు. రెండ రాష్ట్రాల భవిష్యత్‌ ప్రణాళికలను ప్రపంచ నాయకుల ముందు పెట్టి, పెట్టుబడిదారుల ఆకర్షించేలా ప్రణాళికతో వెళ్లారు.

తెలంగాణ దీర్ఘకాలిక లక్ష్యాల ప్రచారం
డేవోస్‌లో తెలంగాణ బృందం రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి పట్టికను ప్రదర్శిస్తుంది. గ్లోబల్‌ సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ ప్రకటన నేపథ్యంలో ఈ సమావేశం కీలకం.

రేవంత్‌ దావోస్‌ పర్యటన రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, ఉద్యోగాలు తీసుకురావచ్చు. రేవంత్‌ రెడ్డి దూరదృష్టి తెలంగాణను ప్రపంచరంగంలో ముందుంచబోతోందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular