KTR: త్వరలోనే మళ్లీ వస్తాం.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు… కాంగ్రెస్ షేక్

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక పెద్దపెద్ద హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చేలా ఒత్తిడి చేస్తామని తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్షంగా కీలక పాత్ర పోషిస్తామని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు.

Written By: Raj Shekar, Updated On : December 7, 2023 12:27 pm

KTR

Follow us on

KTR:తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌.. పూర్తిగా సెల్ఫ్‌ డిఫెన్స్‌లో పడింది. క్యాడర్‌ పూర్తిగా డీలా పడింది. ఇలాంటి పరిస్థితిలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తన నియోజకవర్గం సిరిసిల్లకు బుధవారం వచ్చారు. అంబేద్కర్‌ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన పార్టీ క్యాడర్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అధైర్య పడొద్దని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

హామీల అమలుకు ఒత్తిడి..
కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక పెద్దపెద్ద హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చేలా ఒత్తిడి చేస్తామని తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్షంగా కీలక పాత్ర పోషిస్తామని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు.

త్వరలోనే ప్రజల విశ్వాసం..
ఇక తెలంగాణకు ఏకైక దిక్కు కేసీఆరే అని, ఆయన లేని తెలంగాణను ఎవరూ ఒప్పకోరన్నారు. త్వరలోనే ప్రజల విశ్వాసం చూరగొంటామని తెలిపారు. అప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షం పాత్ర విజయవంతంగా నిర్వర్తిస్తామన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఆర్థికసాయం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలందరికీ ఇళ్లు, ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇలాంటి హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉందన్నారు.

నిలబెట్టుకోకుంటే ఉద్యమిస్తాం..
కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రతీ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. హామీలన్నీ ప్రజలు రాసి పెట్టుకున్నారని తెలిపారు. కార్యకర్తలు, ప్రజలతో కలిసి పోరాడుతాం. వేములవాడలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయాం. ఈ విరామం తాత్కాలికమే అని పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.

కాంగ్రెస్‌ షేక్‌..
కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలుగు దీరక ముందే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంపై సంచలన కామెంట్స్‌ చేస్తున్నారు. మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి, స్టేసన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వం ఎన్నిరోజులు ఉంటుందో తెలియదన్నారు. తాజాగా కేటీఆర్‌ కూడా త్వరలో వస్తామని వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.