https://oktelugu.com/

Viral Video: పాత సంవత్సరం పోయిందన్న బాధలో తాగితే పోలీసోళ్లు పట్టుకుంటారా? వైరల్ వీడియో

పాత సంవత్సరం పోతోంది అనే బాధతో నేను ఒక్క బీరు తాగాను. ఆ బీరు తాగి బండి కూడా నడిపాను. కొంత దూరమైతే మా ఇల్లు వచ్చేది. ఈ లోగానే పోలీసులు నన్ను, నా బండిని ఆపారు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 1, 2024 / 02:52 PM IST
    Follow us on

    Viral Video:  తాగొద్దు.. బయట తిరగొద్దు.. బండ్ల మీద అస్సలు ప్రయాణం చేయొద్దు.. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించొద్దు.. నూతన సంవత్సర వేడుకలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ప్రజలకి, ఇటు పోలీసులకు జారీ చేసిన ఆదేశాలు ఇవి.. ఇదే సమయంలో ఆదాయం కోసం ప్రభుత్వం అర్ధరాత్రి వరకు వైన్ షాపులు నడపడంతో కొత్త సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. పాత సంవత్సరానికి స్వాగతం చెబుతూ చాలామంది “మద్య”ధర సముద్రంలో మునిగి తేలారు.. పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించడంతో చాలామంది దొరికిపోయారు.. అలా దొరికిపోయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలను కూడా తమ వద్ద ఉంచుకున్నారు. అయితే ఇలా పోలీసులకు ఓ యువకుడు దొరికిపోయాడు. ఈ సందర్భంగా ఒక ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన విలేకరి అతడిని ప్రశ్నించగా.. చెప్పిన సమాధానం నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి.

    పాత సంవత్సరం పోతోంది అనే బాధతో నేను ఒక్క బీరు తాగాను. ఆ బీరు తాగి బండి కూడా నడిపాను. కొంత దూరమైతే మా ఇల్లు వచ్చేది. ఈ లోగానే పోలీసులు నన్ను, నా బండిని ఆపారు.. బ్రీత్ ఎనలైజర్ తో టెస్ట్ చేశారు.. మద్యం తాగినట్టు గుర్తించి నన్ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. నా బండిని వారి వద్ద ఉంచుకున్నారు. ఈ మాత్రం తాగడం కూడా తప్పేనా అంటూ ఆ యువకుడు ఆ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ విలేకరితో వాపోయాడు. దీనిని ఓత్సాహిక నెటిజన్ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది.

    నూతన సంవత్సర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా మందికి ఇలాంటి అనుభవం ఎదురు కావడంతో.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మద్యం తాగి బయటికి వెళ్తే చాలు పోలీసులు అడ్డగోలుగా పట్టుకున్నారని.. కోర్టుకు హాజరు కమ్మని కేసు రాశారని.. మద్యం తాగిన ఖర్చు కంటే కోర్టు ఫీజు ఎక్కువ అవుతుందని.. దెబ్బకు తాగిన మత్తు కూడా దిగిపోయిందని తమ అనుభవాలు పంచుకున్నారు. ఇదే సమయంలో కొంతమంది తాగడం ఎందుకు.. తాగిన తర్వాత రోడ్లమీద రావడం ఎందుకు.. ఇలా పోలీసులకు దొరికిపోవడం ఎందుకు.. అని ప్రశ్నించారు.. అయితే ఇలా మద్యం తాగి పోలీసులకు దొరికిపోయిన వారు మాత్రం చాలా విచిత్రంగా అటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.. ప్రభుత్వానికి టాక్స్ పేయర్లు అంటే లెక్క లేకుండా పోయింది.. ఇదే సమయంలో ఖాళీగా కూర్చుని సామాజిక మాధ్యమాలు సర్ఫ్ చేసేవారు కూడా మాలాంటి టాక్స్ పేయర్లకు లెక్చర్లు ఇస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఇక అటు మద్యం తాగి పోలీసులకు దొరికిపోయిన వారి మధ్య.. ఇటు నెటిజన్లకు ప్రస్తుతం కోల్డ్ వార్ జరుగుతుంది. నూతన సంవత్సర సందర్భంగా ట్విట్టర్ ఎక్స్ లో ఇది ప్రాచుర్యంలో ఉంది.