Venuswamy : తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తక్కువ కాలంలోనే ఫేమస్ అయిన జోతిష్యుడు వేణుస్వామి. సెలబ్రిటీలు అడగకున్నా.. వారి గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారు. దీంతో చాలా మంది సినిమా ఇండస్ట్రీవారితోపాటు, రాజకీయ నాయకులు కూడా వేణుస్వామి వద్దకు క్యూకట్టారు. ఆయన చెప్పిన జాతకాల్లో చాలా వరకు నిజం కావడమే ఇందుకు కారణం. ఆయనను ఫేసమస్ చేసింది కూడా ఆయన చెప్పిన జాతకాలే. ఇక ఆయన చాలా మంది సెలబ్రిటీలతో పూజలు చేయించి వారి జాతకాలును కూడా మార్చేశారు.
వివాదాలు కూడా..
జాతకాలతో ఫేమస్ అయిన వేణుస్వామిని వివాదాలు కూడా చుట్టుకున్నాయి. ఆయన కూడా చిక్కుకున్నారు. ఇలా కూడా ఆయన ఫేమస్ అయ్యారు. నాగచైతన్య, శోభిత ధూలిపాళ్ల కూడా కలిసి ఉండలేరని సంచలన ప్రకటన చేశారు. దీనిపై నాగచైతన్య ఫ్యాన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ కొనసాగుతోంది. గతంలో కొందరి జాతకం విషయంలో చేసిన వ్యాఖ్యలపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. ఇలా అనేక సమస్యలు వేణుస్వామిని చుట్టుకున్నాయి. తర్వాత ఆయన భార్య రంగంలోకి దిగి.. క్షమాపణ కోరారు.
తాజాగా సంచలన ప్రకటన..
ఇక వేణుస్వామి తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. జైలుకు వెళ్లిన వారంతా సీఎం అయ్యారని తెలిపారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను ఉదహరించారు. ఈ కారణంగా తాను కూడా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 2028, 2029లో పోటీకి సిద్ధంగా ఉన్టు›్ల పేర్కొన్నారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారన్నది మాత్రం చెప్పలేదు.